MOVIE NEWS

SM1 : సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇస్తున్న ఫన్ మోజీ టీం..ఫస్ట్ లుక్ పోస్టర్ అదిరిందిగా..!!

గతంలో సినిమాల్లో అవకాశం రావాలంటే ఎంతో అదృష్టం ఉంటే గాని అవకాశం వచ్చేది కాదు.. సంవత్సరాల తరబడి స్టూడియోల చుట్టూ తిరిగి కాళ్ళు అరిగిపోయిన ఆర్టిస్టులు చాలా మందే వున్నారు..కొంతమందికి అదృష్టం కలిసి వచ్చి స్టార్స్ గా మారితే.. టాలెంట్ వున్నా కానీ అవకాశం రానివారు చాలా మంది వున్నారు.. అయితే ప్రస్తుతం గతంలో లాగా తమ టాలెంట్ ని నిరూపించడానికి స్టూడియోల చుట్టూ తిరగాల్సిన పని లేదు..ప్రస్తుత జనరేషన్ కి తమ టాలెంట్ నిరూపించుకోడానికి సోషల్ మీడియా అద్భుతమైన సాధనంగా మారింది..ప్రస్తుతం సోషల్ మీడియా ఎంటర్టైన్మెంట్ కి అడ్డాగా మారిపోయింది.. సినిమాలో కూడా దొరకని ఫన్నీ కంటెంట్ అంతా ఇక్కడే దొరుకుతుంది.. యూట్యూబ్, ఫేస్ బుక్, ఇంస్టాగ్రామ్ ఇలా ఏది ఓపెన్ చేసిన టన్నుల కొద్ది మీమ్స్, షార్ట్స్ తో సామాన్యుడికి ఫుల్ ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది.. యూట్యూబ్ లో కొన్ని ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ నాన్ స్టాప్ కామెడీ కంటెంట్ అందిస్తూ దూసుకుపోతున్నాయి.. అలా నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ అందిస్తున్న చానెల్స్ లో ఫన్ మోజీ ఛానల్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి…

దేవర2 బిగ్ అప్డేట్..షూటింగ్ మొదలయ్యేది ఆ నెలలోనే..?

మోజీ పేస్ లతో కామెడీ క్రియేట్ చేసి ప్రేక్షకులకి అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ ని ఈ ఫన్ మోజీ ఛానల్ అందిస్తుంది.. ఈ ఛానల్ లో వచ్చే మిడిల్ క్లాస్ అబ్బాయి మను, ముకేశ్ (ముక్కు), గవ్వల ఘోర పాత్రలు ప్రేక్షకులకి ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందిస్తూ వస్తున్నాయి.. ప్రతీ సారి సరికొత్త కాన్సెప్ట్ తో ఎంతగానో ఆకట్టుకుంటూ వస్తున్న ఈ ఛానల్ బిలియన్ల వ్యూస్, మిలియన్ల సబ్ స్క్రైబర్లను సాధించింది…ఇదిలా ఉంటే ఫన్ మోజీని ఎంతో ఇష్టపడే ప్రేక్షకులకి ఆ సంస్థ క్రేజీ న్యూస్ తెలిపింది..త్వరలో ఫన్ మోజీ టీం వెండితెరపైకి రాబోతోన్నారు. మన్వంతర మోషన్ పిక్చర్స్, శివం సెల్యూలాయిడ్స్ బ్యానర్ల మీద సుశాంత్ మహాన్ హీరోగా కె. సుధాకర రెడ్డి, రవి ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

తాజాగా ఈ కొత్త చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.. ఈ పోస్టర్ ని గమనిస్తే ఈ సినిమా కాన్సెప్ట్ డిఫరెంట్‌గా ఉండబోతోందని అర్థం అవుతోంది. ఏదో అడ్వెంచరస్ మూవీని రూపొందిస్తున్నట్టుగా కనిపిస్తోంది.హీరో సుశాంత్ మహాన్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన ఈ పోస్టర్ అందరిలో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది..ఈ మూవీకి సంబంధించి త్వరలోనే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇవ్వనున్నట్లు మేకర్స్ తెలిపారు

 

 

Related posts

“ఛావా” తెలుగు ట్రైలర్ కి సూపర్ రెస్పాన్స్.. బ్లాక్ బస్టర్ గ్యారెంటీ..!!

murali

మంగళవారం డైరెక్టర్ కే ఎందుకిలా….

filmybowl

వార్ 2 : క్రేజీ అప్డేట్ ఇచ్చిన మేకర్స్.. ఇక ఫ్యాన్స్ కి పండగే..!!

murali

Leave a Comment