MOVIE NEWS

సింబా వచ్చేస్తున్నాడు..పూజా కార్యక్రమం మొదలయ్యేది ఎప్పుడంటే..?

నందమూరి నటసింహం బాలయ్య ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు..హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ సాధించి యంగ్ హీరోలకు పోటీ ఇస్తున్నాడు.. టాలీవుడ్ ఇతర స్టార్ హీరోలు అయిన మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున వారసులు కూడా సినిమా ఎంట్రీ ఇచ్చి అద్భుతంగా రానిస్తున్నారు.. దీనితో బాలయ్య వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం బాలయ్య ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. గత కొంతకాలంగా మోక్షజ్ఞ ఎంట్రీ త్వరలో అంటూ బాలయ్య కాలయాపన చేస్తూ వచ్చారు.. తాజాగా మోక్షజ్ఞ ఎంట్రీ మూవీని బాలయ్య ఫిక్స్ చేసారు..

తేజేశ్విని నందమూరి సమర్పకురాలిగా సుధాకర్ చెరుకూరి ఎస్‌ఎల్‌వి సినిమాస్ & లెజెండ్ ప్రొడక్షన్స్‌పై ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నందమూరి మోక్షజ్ఞ మొదటి మూవీ సిద్ధం అవుతుంది..ఇటీవల మోక్షజ్ఞ లుక్ రివీల్ చేస్తూ సింబా వస్తున్నాడు అంటూ దర్శకుడు ప్రశాంత్ వర్మ చేసిన పోస్ట్ బాగా వైరల్ అయింది.. మోక్షజ్ఞ లుక్ కూడా అదిరిపోయింది..తాజాగా మోక్షజ్ఞ న్యూ లుక్ ఫోటోను ప్రశాంత్ వర్మ సోషల్ మీడియాలో షేర్ చేసారు..  హనుమాన్‌ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాకు దర్శకత్వం వహించిన ప్రశాంత్ వర్మకు బాలయ్య మోక్షజ్ఞ మొదటి మూవీ భాద్యతలు అప్పజెప్పి మంచి నిర్ణయం తీసుకున్నారు…

ఎన్టీఆర్ నీల్ మూవీ టైటిల్ పై బిగ్ అప్డేట్ వైరల్..!!

మోక్షజ్ఞ తొలి మూవీ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగం అవుతుంది.మోక్షజ్ఞ నటన, ఫైట్లు మరియు డ్యాన్స్‌లలో ప్రముఖలు వైజాగ్ సత్యానంద్ వద్ద శిక్షణ పొందాడు. తాజాగా స్టైలిష్ లుక్‌లో అద్దంలోకి చూస్తున్న మోక్షజ్ఞ కొత్త స్టిల్ విడుదలైంది. గళ్ల చొక్కా ధరించి, పర్ఫెక్ట్ స్టైల్ చేసిన పొడవాటి జుట్టు మరియు గడ్డంతో చిన్న సింహం లాగా మెరిసిపోతున్నాడు అని ఫ్యాన్స్ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలను డిసెంబరు 5న నిర్వహిచనున్నట్లు సమాచారం.. సుధాకర్ చెరుకూరి భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించనున్నారు. భారతీయ పురాతన పౌరాణిక ఇతిహాస గాధ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి ఇతర వివరాలు మేకర్స్ తెలియజేయనున్నారు..

Related posts

ఆ స్టార్ హీరోల ఫ్యాన్స్ కి కోపం తెప్పించిన శ్రీలీల.. అసలు ఏం జరిగిందంటే..?

murali

భారీ రికార్డ్ కి అడుగు దూరంలో పుష్ప 2..ఆ రికార్డ్ ని బ్రేక్ చేస్తుందా..?

murali

‘దేవర’ నచ్చలేదు.. స్టార్ ప్రొడ్యూసర్ నాగవంశీ షాకింగ్ కామెంట్స్..?

murali

Leave a Comment