మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ “చిరుత” సినిమాతో టాలీవుడ్ కి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు..చిరు తనయుడు కావడంతో రామ్ చరణ్ మొదటి సినిమాకు ప్రేక్షకులలో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.. సినిమాలో మణిశర్మ ఇచ్చిన సాంగ్స్ కూడా అదిరిపోవడంతో ప్రేక్షకులు ఈ సినిమాకు మంచి విజయం అందించారు. అయితే రాంచరణ్ స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ అవ్వాలంటే భారీ హిట్ అందుకోవాలనే ఉద్దేశంతో నిర్మాత అల్లుఅరవింద్ తన రెండో సినిమాను దర్శకధీరుడు రాజమౌళితో సెట్ చేసారు. రాజమౌళి, రాంచరణ్ కాంబోలో వచ్చిన మగధీర ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘మగధీర’ గురించి అల్లుఅరవింద్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.
తండేల్ : ప్రివ్యూ షో టాక్ అదిరిందిగా.. క్లైమాక్స్ అన్ ప్రిడిక్టబుల్..!!
ఎస్. ఎస్. రాజమౌళి కెరీర్ ప్రారంభం నుంచే చాలా అద్భుతమైన డైరెక్టర్. నా మేనల్లుడు రామ్ చరణ్ చేసిన మొదటి సినిమా ప్రేక్షకులకు నచ్చింది.. రెండో సినిమాకి నేను నిర్మాతగా వున్నాను..కాబట్టి నా మేనల్లుడికి ఎలాగైనా భారీ హిట్టు ఇవ్వాలని అనుకున్నాను. అందుకే ఎంత ఖర్చు అయినా పర్లేదు, పెట్టిన డబ్బులు వెనక్కి రాకపోయినా పర్లేదని రిస్క్ చేయమని చెప్పాను.
అలా మగధీర కోసం ఏకంగా రూ.40 కోట్లు ఖర్చు చేశాం. ఓ హీరో రెండో సినిమాకి అంత బడ్జెట్ పెట్టడం చాలా రిస్క్..కచ్ఛితంగా నష్టాలు వస్తాయని నేను ఫిక్స్ అయ్యాను. కానీ ఊహించని దానికంటే రెట్టింపు లాభాలు వచ్చాయి. రాజమౌళి ఇప్పుడు పాన్ ఇండియా డైరెక్టర్‌గా అద్భుతంగా రానిస్తున్నారు..ప్రస్తుతం ఆయన సినిమాలు గ్లోబల్ మార్కెట్ ని రీచ్ అవుతున్నాయి..ఈ రేంజ్ లో దూసుకెళ్తారని మేము అస్సలు అనుకోలేదు.. మగధీర రిజల్ట్ నిజంగా నాకు పాజిటివ్ షాక్ అని అల్లుఅరవింద్ తెలిపారు..