MOVIE NEWS

గేమ్ ఛేంజర్ స్టోరీ లీక్ చేసిన శంకర్.. చరణ్ నటనకు ఫిదా..!!

గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “ గేమ్ ఛేంజర్ “.. స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నేడు రాజమండ్రిలో గ్రాండ్ గా జరుగుతుంది.. ఈ ఈవెంట్ కి ముఖ్య అతిధిగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరయ్యారు.. ఈ సినిమా గురించి దర్శకుడు శంకర్ మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.. ముందుగా ఈ ఈవెంట్ కి ముఖ్యఅతిథిగా వచ్చిన పవన్ కళ్యాణ్ కి ఆయన థాంక్స్ చెప్పారు. అలాగే రాజమండ్రి వాసులందరికీ నమస్కారం చెబుతూ వచ్చిన అతిథులందరికీ శంకర్ థాంక్స్ చెప్పారు.

హరిహర వీరమల్లు : ‘మాట వినాలి’ అంటున్న పవన్ న్యూ స్టిల్ అదిరిందిగా..!!

శంకర్ మాట్లాడుతూ నేను ఈ 30 సంవత్సరాలలో ఒక 14 సినిమాలు చేశాను. ఒకటి కూడా నేరుగా తెలుగు సినిమా అయితే చేయలేదు. కానీ నేను చేసిన అన్ని సినిమాలు తెలుగులో డబ్బింగ్ అయి రిలీజ్ అయ్యాయి. అలా డబ్బింగ్ వచ్చిన సినిమాలకే తెలుగు ప్రేక్షకులైన మీరు ఎంతో సపోర్టు ఇచ్చారు.నా సినిమాలపై ఎంతో ప్రేమ చూపించారు. నేను తిరిగి మీకు రెస్పెక్ట్ ఇవ్వాలని ఒక స్ట్రెయిట్ తెలుగు సినిమా చేయాలని చాలా సంవత్సరాలు అనుకుంటున్నాను.అది ఇప్పటికీ కుదిరింది. ఈ ప్రయత్నానికి సహాయపడిన రాజు గారికి, రామ్ చరణ్ గారికి ఇద్దరికీ శంకర్ థాంక్స్ చెప్పారు..

ఈ సినిమా పూర్తిగా తెలుగు స్ట్రెయిట్ సినిమా. అంతా తెలుగు సినిమాలా ఉండాలని అందరూ తెలుగు నటులని టెక్నీషియన్లను తీసుకున్నాము.. అలాగే ఆంధ్రాలోని చాలా లోకేషన్స్ లో ఈ సినిమా షూట్ చేసాం. ఈ సినిమా స్టోరీ ఒక కలెక్టర్ కి ఒక మినిస్టర్ కి జరిగే వార్. ఆ హీరో క్యారెక్టర్ వెనుక  మరో స్టోరీ ఉంటుంది.. అది ఎలా వచ్చి మిమ్మల్ని ఎంగేజ్ చేస్తుందని సినిమాలోనే చూడాలి. అందులో రామ్ చరణ్ గారు ఒక్కొక్క క్యారెక్టర్ లో నటించలేదు  ఎంతో రియల్ గా అనిపించేలా చేసారని శంకర్ చరణ్ ని మెచ్చుకున్నారు.

Related posts

Pushpa 2 : ట్రైలర్ ఈవెంట్ కు దూరంగా సుకుమార్.. కారణం అదేనా..?

murali

OG : పవన్ కల్యాణ్ సినిమాలో మరో స్టార్ హీరో.. ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

murali

మహేష్ కు రాజమౌళి సరికొత్త కండిషన్స్.. బాబు పాటిస్తాడా..?

murali

Leave a Comment