MOVIE NEWS

గేమ్ ఛేంజర్ : స్టోరీ రివీల్ చేసిన శంకర్.. ఈ సారి గట్టిగానే ప్లాన్ చేసాడుగా..!!

గ్లోబల్ స్టార్ రాంచరణ్ హీరోగా నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ గేమ్ ఛేంజర్ “.. తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ సినిమా పై ప్రేక్షకులలో విపరీతమైన అంచనాలు ఉన్నాయి.అయితే శంకర్ కెరీర్ ఇప్పుడు డౌన్ ఫాల్ అయింది..కెరియర్ స్టార్టింగ్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలు తెరకెక్కించిన శంకర్.. తమిళ్ స్టార్ డైరెక్టర్ గా ఓ వెలుగు వెలిగారు.. ఆయన సినిమాలు తమిళ్ ప్రేక్షకులకే కాదు తెలుగు ప్రేక్షకులని సైతం ఎంతగానో అలరించాయి. ఆయనకీ తెలుగులో కూడా సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది… శంకర్ చేసిన ప్రతి సినిమా తెలుగులో డబ్బింగ్ అవుతూ వచ్చేవి.

బాలయ్య షోలో వెంకీ మామ.. ఇది కదా అసలైన ఎపిసోడ్ అంటే..!!

ఇక శంకర్ మొదటిసారి డైరెక్ట్ తెలుగు సినిమాను చేస్తున్నాడు. ” ఆర్ ఆర్ ఆర్” సినిమా తర్వాత రామ్ చరణ్ సోలో హీరోగా నటిస్తున్న సినిమా ఇది. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమాను శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ ఎంతో గ్రాండ్ గా ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ మూవీ జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచిన మేకర్స్ డిసెంబర్ 21న యు.ఎస్‌లోని డల్లాస్‌లో గేమ్ చేంజర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్ గా నిర్వహించారు.

ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.. ఈ సినిమా నుండి ఇప్పటివరకు రిలీజ్ అయిన సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి..ఇదిలా ఉంటే దర్శకుడు శంకర్ ఈ సినిమా స్టోరీని రివీల్ చేసారు.. గేమ్ ఛేంజర్ సినిమా ఒక ప్రభుత్వ అధికారికి ఒక ఐఏఎస్ ఆఫీసర్ కి మధ్య కథ అని ఆయన తెలిపారు..యంగ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు ఈ కథ రాయగా.. శంకర్ సినిమా రేంజ్ లో కథ ఉండటం వలన తన అసిస్టెంట్ డైరెక్టర్ తో డిస్కస్ చేసి ఈ కథను ఆయనే డైరెక్ట్ చేస్తే బాగుంటుంది అని కార్తీక్ ..శంకర్ కు ఈ కథను అప్పగించారు.అయితే ఈ కథను పవన్ కళ్యాణ్ హీరోగా చేద్దామని శంకర్ ఫిక్స్ అయ్యారు కానీ నిర్మాత దిల్ రాజు సలహాతో రాంచరణ్ తో ఈ మూవీ చేసారు ..

Related posts

కల్కి 2898AD : పార్ట్ 2 పై స్టన్నింగ్ అప్డేట్ ఇచ్చిన అశ్వినీదత్..!!

murali

విశ్వంబర సినిమా లో అ….అ…అ

filmybowl

డాకు మహారాజ్ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ముహూర్తం ఫిక్స్..!!

murali

Leave a Comment