MOVIE NEWS

గ్లింప్స్ తో సంచలనం.. ఫ్యాన్స్ డౌట్స్ అన్నీ క్లియర్ అయినట్టేగా..!!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “పెద్ది”.. ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ గ్లింప్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. రాంచరణ్ బర్త్డే రోజే రిలీజ్ చేయాల్సిన ఈ గ్లింప్స్ కొన్ని సాంకేతిక కారణాల వల్ల శ్రీరామనవమికి వాయిదా పడింది.చెప్పిన్నట్టుగానే గ్లింప్స్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో రామ్ చరణ్‌ ఊరమాస్ లుక్ లో కనిపించాడు., చెదిరిన జుట్టు, గడ్డంతో పవర్ ఫుల్ లుక్ లో కనిపించాడు. ఉత్తరాంధ్ర యాసలో చరణ్ చెప్పిన డైలాగ్స్ అదిరిపోయాయి..ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ ఇచ్చిన మాస్ బీజీఎం సైతం చాలా ప్లస్ అయింది.ఈ సినిమా బిగ్గెస్ట్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది..

పూరీ, విజయ్ మూవీలో బాలీవుడ్ స్టార్ బ్యూటీ..?

తాజాగా రిలీజ్ చేసిన గ్లింప్స్ లో రాంచరణ్ క్రికెట్ ఆడుతున్నట్లుగా బుచ్చిబాబు చూపించాడు..చరణ్ ఇందులో క్రికెట్ ఆడేటప్పుడు బ్యాట్ ను నేలకేసి కొట్టి మరీ సిక్స్ కొట్టే ఆ ఒక్క షాట్ తోనే మూవీ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఈ గ్లింప్స్ చూసిన తర్వాత ఫ్యాన్స్ లో సినిమాపై వున్న డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోయాయి. సినిమాలో బుచ్చిబాబు ఎంచుకున్న కాస్ట్యూమ్స్, రామ్ చరణ్‌ గెటప్, విలేజ్ విజువల్స్, స్లాంగ్ అన్నీ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేశాయి.

బుచ్చిబాబు ఈ గ్లింప్స్ ను ఎంతో పవర్ ఫుల్ గా కట్ చేయించాడు. కేవలం 60 సెకన్ల వీడియో సంచలనం సృష్టిస్తుంది..గ్లింప్స్ వీడియో లో కేవలం రామ్ చరణ్‌ క్యారెక్టర్ గురించే చూపించాడు. దీంతో ఈ మూవీపై ఫ్యాన్స్ భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు.చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ నిరాశ పరచడంతో బుచ్చిబాబు సినిమాపైనే ఫ్యాన్స్ భారీగా ఆశలు పెట్టుకున్నారు..మరి బుచ్చి బాబు ఫ్యాన్స్ ఆశలు నెరవేరుస్తాడో లేదో చూడాలి..

 

Related posts

పుష్ప 2 : పాట్నా ఈవెంట్ పై సిద్దార్థ్ షాకింగ్ కామెంట్స్.. వైరల్..!!

murali

ఊసే లేని ‘విశ్వంభర’.. వశిష్ఠ అప్డేట్ ఎక్కడ..?

murali

గ్రాండ్ గా సలార్ రీరిలీజ్..ఫ్యాన్స్ హడావుడి మాములుగా లేదుగా..!!

murali

Leave a Comment