టాలీవుడ్ సీనియర్ హీరో శివాజీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. కెరీర్ లో ప్రారంభం లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోగా, విలన్ గా కూడా అద్భుతంగా నటించి వరుస సూపర్ హిట్స్ అందుకున్నాడు. శివాజీ 25 ఏళ్ల నుంచి ఇండస్ట్రీ లో కొనసాగుతున్నా హీరోగా ఒక స్థాయికి మించి ఎదగలేకపోయాడు. హీరోగా ఛాన్సులు ఆగిపోవడం తన రేంజ్ కి తగ్గ పాత్రలు రాకపోవడంతో కొన్నాళ్ళ పాటు శివాజీ సినిమాలు చేయడమే మానేశాడు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద పూర్తి దృష్టిపెట్టాడు. కానీ కొంత కాలానికి రాజకీయాలకు కూడా శివాజీ దూరం అయ్యారు.. ఏం చేయాలో ఆలోచిస్తున్న సమయంలో శివాజీకి ఉహించని విధంగా ‘బిగ్ బాస్’ షోలో ఆఫర్ వచ్చింది.. ఆ షోలో కంటెస్టెంట్ గా పాల్గొనడంతో శివాజీ మళ్ళీ లైమ్ లైట్ లోకి వచ్చాడు…
ఆయనతో టైం స్పెండ్ చేయడం ఇష్టం.. దిల్ రాజు వైఫ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!
ఆ తర్వాత ఆయన చేసిన ‘నైంటీస్ మిడిల్ క్లాస్’ వెబ్ సిరీస్ కు ఎంతటి భారీ రెస్పాన్స్ వచ్చిందో మనందరికి తెలిసిందే.తన కెరీర్ ని టర్న్ చేసే ఆఫర్ కోసం శివాజీ ఎదురుచూస్తున్నాడు. తాజాగా వచ్చిన ‘కోర్ట్’ సినిమా లోని మంగపతి శివాజీ ఇన్నేళ్ల ఆకలి తీర్చింది..మంగపతి క్యారెక్టర్లో శివాజీ పెర్ఫామెన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. సినిమాలో మేజర్ హైలైట్ ఆ పాత్రే అని ప్రేక్షకులు చెబుతున్నారు. ‘కోర్ట్’ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడం, తన పాత్రకు అద్భుతమైన స్పందన వస్తుండడంతో సినిమా సక్సెస్ మీట్లో శివాజీ ఎంతో ఎమోషనల్ అయ్యారు..
తాజాగా ఒక ఇంటర్వ్యూలో దీని గురించి మాట్లాడుతూ.. పాతికేళ్లుగా సినీ రంగంలో ఉన్నా. శుక్రవారం ఇది నా రోజు అనుకునేలా చేయాలని ఎప్పుడూ ప్రయత్నిస్తు వున్నా కానీ కుదరడం లేదు. నాకు తగిన పాత్ర రావడం లేదని చాలా ఫీలయ్యేవాడిని. గత ఏడాది ‘సరిపోదా శనివారం’ చిత్రంలో సూర్య పాత్ర చూసి చాలా బాధేసింది. నాకెందుకు ఇలాంటి పాత్ర రావడం లేదు అని.. బాత్రూంలో ఫేస్ వాష్ చేసుకుంటూ కోపంతో చేత్తో అద్దాన్ని గట్టిగా కొట్టాను. చెయ్యి వాచి కొన్ని రోజులు ఇబ్బంది పడ్డాను. ఈ విషయాన్ని నానితో కూడా చెప్పాను. కానీ మంగపతి పాత్ర నా ఇన్నేళ్ల భాదని తీర్చింది అని శివాజీ తెలిపారు..