SDT18 Teaser : నేడు సాయి దుర్గ తేజ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటిస్తున్న కొత్త సినిమా SDT18 సినిమా నుంచి మేకింగ్ వీడియో రిలీజ్ చేసారు చిత్ర బృందం.
సాయి దుర్గా తేజ్ తన మేనమామ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి నటించిన ‘బ్రో’ సినిమా తర్వాత చాన్నాళ్లు గ్యాప్ తీసుకొని ఇప్పుడు SDT18 సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు.
అప్ కమింగ్ స్టార్ తేజ సజ్జా తో హనుమాన్ లాంటి సూపర్ హిట్ తీసిన ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై కొత్త దర్సకుడు రోహిత్ దర్శకత్వంలో సాయి దుర్గ తేజ్ తన నెక్స్ట్ సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమాలో ఐశ్వర్య కథానాయికగా నటిస్తుంది. ఈరోజు రిలీజ్ ఐన టీజర్ చూస్తుంటే ఇది పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో జరిగే యాక్షన్ సినిమా అని తెలుస్తుంది. నేడు సాయి బర్త్ డే సందర్భం గా రిలీజ్ చేసిన టీజర్ ఎలా ఉందొ లుక్ వేద్దాం పదండి.
Read Also : మెకానిక్ రాకీ: ‘మాస్ కా దాస్’ సినిమా నుంచి ఎగ్జైటింగ్ అప్డేట్
ఈ టీజర్ చూస్తుంటే ఈ సినిమా ని భారీగానే ప్లాన్ చేసినట్టు అర్ధమవుతుంది. కర్చుకి వెనకాడకుండా పెద్ద బడ్జెట్ ఏ సినిమా కోసం కెటాయించినట్లు తెలుస్తుంది. సాయి కెరీర్‌లో అత్యదిక బడ్జెట్‌లో రూపొందే సినిమా ఇదే అంటున్నారు. పీరియాడిక్ లుక్ లో కంప్లీట్ యాక్షన్ సినిమాగా నిర్మాతలు తెరకెక్కిస్తున్నారు. .
ఇక ఈ సినిమా కోసం సాయి కూడా బాగా కష్టపడినట్టు అర్ధమవుతుంది. బాడీ పెంచి సూపర్ లుక్ అయితే మెయింటైన్ చేసాడు.
రిలీజ్ చేసిన ఈ మేకింగ్ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. భారీ తారాగణం కంప్లీట్ న్యూ సెట్ అప్ తో దర్శనమిచ్చిన టీజర్ సినిమా పై అంచనాలు పెంచేసిందనే చెప్పాలి .
సినిమా ఇంకా చిత్రీకరణ దశలో ఉంది కాబట్టీ అప్పుడే ఏం చెప్పలేం. సాయి తేజ ఆల్ ది బెస్ట్ & పుట్టిన రోజు శుభకాంక్షలు తప్పా….
Follow us on Instagram