Saripodhaa Sanivaaram Movie Full Review
Saripodhaa Sanivaaram Movie ఎలా ఉందొ ఒక లుకేద్దాం
తారాగణం: నాని, ప్రియాంక, ఎస్ జె సూర్య, సాయికుమార్ ,మురళీశర్మ , అజయ్ ఘోష్ , శుభలేఖ సుధాకర్, బాబూమోహన్ తదితరులు
ప్రొడక్షన్: డివీవీ ఎంటర్టైన్మెంట్స్
ప్రొడ్యూసర్స్: దానయ్య
రైటర్ & డైరేక్షన్: వివేక్ ఆత్రేయ
మ్యూజిక్: జాక్స్ బిజోయ్
రిలీజ్ డేట్: ఆగష్టు 29, 2024
హీరో – దర్శకుడు కలయిక లో వచ్చిన మొదటి చిత్రం ANTE SUNDARANIKI కల్ట్ సినిమాగా పేరొచ్చినా ఆడలేదు
ఎలాగైనా ఈ సారి హిట్ కొట్టాలన్న కసి ఇద్దరిలో వుంది. అదే కసి సినిమా లో కూడా కనిపించింది అనడంలో అతిశేయోక్తి లేదు
చాలా మంది దర్శకులు ఒక కాన్సెప్ట్ తో సినిమా తీస్తుంటారు
మరికొద్ది మంది దర్శకులు కమర్షియల్ ఎలిమెంట్ ని నమ్ముకొని సినిమా తీస్తుంటారు
ఈ రెండిటిని నమ్ముకోని దర్శకుడు ఒక సినిమా తీస్తే అదే సరిపోదా శనివారం
కథలోకి వెళ్తే ప్రతి సారి వినేదే
హీరో కి చెప్పలేనంత కోపం , ఎప్పుడు గొడవ కి ముందుంటాడు
తండ్రికి గొడవలు అంటే నచ్చవు
అందుకే హీరో తల్లి హీరో నుంచి ఒక మాట తీసుకుంటది
శనివారం మాత్రమే నీ కోపం చూయించు, మిగిలిన 6 రోజులు నీ కోపం దాచుకో
అలా హీరో తన కోపాన్ని మిగిలిన రోజులు ఒక డైరీ లో దాచుకుంటాడు. శనివారం మాత్రం ఆ కోపమొచ్చిన వాళ్ళ మీద విశ్వరూపం చూయిస్తుంటాడు.
ఇక విల్లన్ దయానంద్ (ఎస్ జె సూర్య) ఒక సైకో పోలీస్ ఆఫీసర్ తన కోపానికి కారణమైన అన్నయ ని అందలం ఎక్కించినందుకు సోకులపాలెం అనే గ్రామంలో ని ప్రజలని చితక్కొడుతుంటాడు.
హీరోయిన్ చారులత (ప్రియాంక) తన పై అధికారి సైకోయిజం చూసి అతన్ని ఎం చేయలేక సోకులపాలెం ప్రజలకి ఎలా ఐన సాయం చెయ్యాలని చూస్తుంటది.
ఈ మధ్యలో చారు తో సూర్య కి ప్రేమ. ఆ ప్రేమ లో సోకులపాలెం ప్రజలకి సూర్య చేసే సాయం ఏంటి ?
పోలీస్ ఆఫీసర్ కి, సూర్య కి మధ్య వచ్చే కాన్ఫ్లిక్ట్ ఏంటి? వాడి నుంచి ప్రజలని ఎలా కాపాడాడు
చిన్నప్పుడే తప్పిపోయిన సూర్య మరదలు కళ్యాణి ఏమైంది?
సూర్య సోదరి పెళ్ళిలో ఎం జరిగింది ?
ఎవరి పెర్ఫార్మన్స్ ఎలా
సింపుల్ గా చెప్పాలంటే
ఒక హీరో ,ఒక విలన్, ఒక ఊరు
ఊరుని పీడించే విలన్ , విలన్ ని ఎదిరించే హీరో, ఆఖరికి సంతోషం లో ఆ ప్రజలు – ఇదే కథ
ఎన్ని సినిమాల్లో చూసుంటారు ఇదే స్టోరీ ని కానీ సరిపోదా శనివారం లో ఇది మాత్రమే కాదు
ఒక చిన్న కాన్సెప్ట్ తో కథ కి కొత్త రూపం ఇచ్చాడు దర్శకుడు
హీరో- దర్శకుల నిజ జీవితం లో ఉన్న కసి ని ఈ సినిమా లో విలన్ కి పెట్టేసారు
ఇక చెప్పేదేముంది దయ పాత్రలో ఎస్ జె సూర్య చెలరేగిపోయాడు
ఎంతలా అంటే ఒకానొక దశలో హీరో -విలన్ పోటా పోటీ అన్నట్టు నటిస్తే
మరొకసారి విలన్ క్యారెక్టర్ హీరో క్యారెక్టర్ ని దాటేసింది అనాలి
ఎస్ జె సూర్య లేకపోతే సరిపోదా శనివారం లేదు అన్నట్టుంటది దయా క్యారెక్టర్
వివేక్ ఆత్రేయ ఈ కథ కి చాల కష్టపడ్డాడు . ప్రతి చిన్న విషయం కూడా డిటైల్డ్ గా చేయించి దాన్ని స్క్రీన్ప్లే లో భాగం చేసి సినిమా కి కావాల్సిన సమయానికి మలుపు లు ఇచ్చాడు (వాల్ క్లాక్ పది నిముషాలు సీన్)
Read Also : ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం మూవీ ఎలా ఉందొ ఒక లుకేద్దాం
నాని చైల్డ్ హుడ్ సీన్స్ సాగదీతలనే ఉంటాయి కానీ ఇక్కడ దర్శకుడు తన సినిమా ని చాల క్లియర్ గా ప్రేక్షకుడికి చెప్పాలనుకున్నాడు. అలా చెప్పడంలో ఈ సారి మాత్రం డిస్టింక్షన్ లోనే పాస్ అయ్యాడు
దర్శకుడు ఇలా పాస్ అవ్వడానికి అతని టెక్నికల్ టీం చాల కృషి చేసింది. మ్యూజిక్ డైరెక్టర్, ఎడిటింగ్, కెమెరా వర్క్ అన్ని కరెక్ట్ గా కుదిరిన సినిమా ఇది. పైగా దర్శకుడు ఈ సినిమా ని విభజించుకుంటూ ముందుకు వెళ్ళాడు. అదేంటో మీరు సినిమాలోనే చుడండి
కథ నచ్చితే దర్శకుడు ఎవరు, అనుభవం ఏంటి అని చూడని హీరో నాని
అలాంటిది తనకి నచ్చిన దర్శకుడు తనకి ఇష్టమైన కథనే తీసుకొస్తే నాని ఎలా చెలరేగిపోతాడో ఈ సినిమాలో చూడచ్చు
సూర్య పాత్ర ని నాని చాలా ఈజ్ తో చేసాడని చెప్పచ్చు
నాని సినిమా అంటే ఎంత మంది నటీనటులు వున్నా సినిమా నుంచి బయటకి వచ్చేటపుడు నాని మాత్రమే గుర్తుంటాడు అలాంటిది ఈ సినిమా లో నాని తో పాటు ఎస్ జె సూర్య కూడా గుర్తుకు వస్తాడు అంటే దయాపాత్ర ఎంత బాగా చేసాడో మీ ఊహకే వదిలేస్తున్నాం
ఇంకా హీరోయిన్ గా ప్రియాంక , నాని తండ్రి పాత్రలో సాయికుమార్ అద్భుతంగా నటించారు. మురళిశర్మ పాత్ర కూడా కధకి ఉపయోగే పడే విధంగా ఉంటుంది
ఇంకా వివేక్ ఈ సినిమా తో మంచి హిట్ కొట్టాడు. తన కెరీర్ తో పాటు నాని కి ఉన్న హిట్ బాకీ కూడా తీర్చేసాడు.
చివరగా
సరిపోదా శనివారం – ఆడియన్స్ కి ఫుల్ గా సరిపోయిద్ది
Filmy Bowl Rating: 3.25/5
Follow us on Instagram