MOVIE NEWS

సంక్రాంతికి వస్తున్నాం : కామెడీ టైమింగ్ తో అదరగొట్టిన వెంకీ మామ.. ట్రైలర్ అదిరిందిగా..!!

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ వెంకటేష్ నటించిన లేటెస్ట్ మూవీ “సంక్రాంతికి వస్తున్నాం“..టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ బిగ్గెస్ట్ ఎంటర్టైనర్ తెరకెక్కింది..వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబో లో గతంలో వచ్చిన ఎఫ్2, ఎఫ్ 3 లలు సినిమాలు మంచి విజయం సాధించాయి.. దీనితో వెంకీ, అనిల్ కాంబోలో హ్యాట్రిక్ మూవీ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న “సంక్రాంతికి వస్తున్నాం” సినిమాను మేకర్స్ విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో వెంకటేష్ సరసన ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమా ఖచ్చితంగా విజయం సాదిస్తుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు…

చరిత్ర సృష్టించిన “పుష్ప 2”..బాహుబలి 2 రికార్డ్ లేపేసిందిగా..!!

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ ,సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. తాజాగా “సంక్రాంతి వస్తున్నాం” సినిమా ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు.దర్శకుడు అనిల్ రావిపూడి మరోసారి తనదైన కామెడీ కంటెంట్ తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతున్నారు. ఈ సినిమాలో వెంకటేష్ మాజీ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు. అలాగే వెంకటేష్ భార్యగా ఐశ్వర్య రాజేష్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గా మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. కామెడీతో పాటు ఎమోషనల్ డ్రామాగా ఈ ఉండనుందని సమాచారం.ఈ సంక్రాంతికి పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా సంక్రాంతికి వస్తున్నాం సినిమాను దర్శకుడు అనిల్ రావిపూడి రెడీ చేశారు.

తాజాగా రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. మరోసారి వెంకటేష్ తన నటనతో కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అలాగే వెంకీ భార్యగా ఐశ్వర్య రాజేష్ అద్భుతమైన అభినయంతో ఆకట్టుకుంది.అలాగే హీరోయిన్ మీనాక్షి చౌదరి తన అందంతో ఎంతగానో ఆకట్టుకుంది. రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రల్లో వెంకటేష్ అదరగొట్టారు. ఈ ట్రైలర్ ను సూపర్ స్టార్ మహేష్ సోషల్ మీడియా ద్వారా విడుదల చేసారు..

Related posts

ఫ్యాన్స్ తో కలిసి “పుష్ప 2” చూడబోతున్న ఐకాన్ స్టార్..!!

murali

పుష్ప 2 గురించి దేవి మాటల్లో..

filmybowl

వారసుడి ఎంట్రీపై బాలయ్య పూర్తి ఫోకస్..షూటింగ్ షురూ అయ్యేది ఎప్పుడంటే..?

murali

Leave a Comment