MOVIE NEWS

సంక్రాంతికి వస్తున్నాం : ప్రమోషన్స్ లో ట్రెండ్ సెట్ చేస్తున్న ” వెంకీ మామ”

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ నటించిన లేటెస్ట్ మూవీ “ సంక్రాంతికి వస్తున్నాం “.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 14న గ్రాండ్ గా రిలీజ్ కానుంది..శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది..ఈ సినిమాలో క్యూట్ బ్యూటీస్ ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించారు…ఈ సినిమా మీద ప్రేక్షకులలో పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి.రిలీజ్ డేట్ దగ్గర పడుతుందటంతో ప్రమోషన్స్ లో జోరు పెంచేస్తున్నారు. ఇప్పటి వరకు ఎవ్వరూ చేయని రేంజ్ లో ప్రమోషన్స్ చేస్తున్నారు.

7/G బృందావన కాలనీ 2 : క్లాసిక్ మూవీకి సీక్వెల్ వచ్చేస్తుంది.. ఫస్ట్ లుక్ పోస్టర్ వైరల్..!!

ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్స్ సినిమాపై సూపర్ హైప్ తీసుకొచ్చాయి..సినిమాలోని సాంగ్స్ అయితే ఫుల్ ట్రెండ్ లో ఉన్నాయి. ఈ సినిమా ప్రమోషన్స్ మాత్రం మేకర్స్ చాలా కొత్తగా చేస్తున్నారు. ఇప్పటివరకు సినిమా నుంచి రిలీజ్ చేసిన కంటెంట్ కంటే ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై ఎక్కువ హైప్ తెచ్చింది..ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఈ ప్రమోషన్స్ ఉంటున్నాయి.

పోస్టర్స్ లో కొత్తదనం, వెంకటేష్ నేను సాంగ్ పాడతాను అని అనిల్ రావిపూడిని ఏడిపించే వీడియో, అరకులో పిల్లలతో వెంకటేష్ వీడియో, అరకులో అనిల్ రావిపూడి సినిమా కోసం ఫ్యాన్స్ గోల, క్యారెక్టర్స్ తో ప్రెస్ మీట్ పెట్టడం, మీడియాతో ప్రశ్నలు అడిగించకుండా కథలు చెప్పించడం, బయట ఈవెంట్స్ కి వెళ్లి స్వయంగా వెంకిమామ డ్యాన్స్ చేయడం.. ఇలా రకరకాల ప్రమోషనల్ కంటెంట్ రిలీజ్ చేస్తూ సినిమాపై హైప్ పెంచారు.ఇప్పుడైతే ఏకంగా న్యూ ఇయర్ సందర్భంగా స్పెషల్ ఇంటర్వ్యూ రిలీజ్ చేసారు. ఈ ఇంటర్వ్యూలో దిల్ రాజు ఘర్షణలో వెంకటేష్ లాగా, అనిల్ రావిపూడి జయం మనదేరాలో వెంకటేష్ లాగా, ఐశ్వర్య రాజేష్ చంటిలో వెంకటేష్ లాగా, మీనాక్షి బొబ్బిలి రాజాలో వెంకటేష్ లాగా గెటప్స్ వేసుకొచ్చి వెంకటేష్ ని ఇమిటేట్ చేస్తూ ఫుల్ సందడి చేసారు. దీంతో ఈ ఇంటర్వ్యూ ట్రెండ్ అవుతుంది.

 

Related posts

విశ్వంభర : మెగాస్టార్ మూవీ సమ్మర్ కి కూడా కష్టమేనా..?

murali

పుష్ప 2 గురించి దేవి మాటల్లో..

filmybowl

పుష్ప 2 : వాయిదా విషయంపై ఎవరి వాదన వారిది.. మరి సుకుమార్ ఏం చేస్తాడో..?

murali

Leave a Comment