Uncategorized

సంక్రాంతికి వస్తున్నాం : వెంకీ మామ సినిమాకి గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం..!!

సంక్రాంతి కానుకగా ఈ ఏడాది మూడు భారీ సినిమాలు గ్రాండ్ గా రిలీజ్ కానున్నాయి. ఈ సినిమాలలో గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటించిన “గేమ్ ఛేంజర్” బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అవుతుంది.. అలాగే నటసింహం బాలయ్య నటించిన డాకు మహారాజ్, విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు బరిలో వున్నాయి..ఈ సినిమాలు పెద్ద సినిమాలు కావడంతో పైగా సంక్రాంతి సీజన్ కి రిలీజ్ అవుతుందటంతో ప్రేక్షకులలో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.. అయితే పెద్ద సినిమాలు విడుదల అయ్యేటప్పుడు ప్రభుత్వం సినిమా టిక్కెట్ల పెంపునకు అనుమతి మంజూరు చేయాలంటూ నిర్మాతలు విన్న వించుకునే సంగతి అందరికి తెలిసిందే..

భవిష్యత్ లో ఆ హీరో బయోపిక్ తెరకెక్కిస్తా..శంకర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

ఈ క్రమంలోనే సంక్రాంతికి వస్తున్నాం సినిమా చిత్ర బృందానికి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్‌ చెప్పింది. ఈ సినిమా టికెట్ ధరలను పెంచుకోవడానికి అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.విక్టరీ వెంకటేష్ నటిస్తున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమా విడుదల రోజు నుంచి మొదటి పది రోజులు సింగిల్ స్క్రీన్స్‌లో రూ. 100, ముల్టీప్లెక్స్‌లో రూ. 125 పెంచుతూ అనుమతులు ఇచ్చింది. ఈ పెంపుతో సంక్రాంతికి వస్తున్నాం టక్కెట్ ధరలు రూ. 245, రూ. 175 రూ. 302గా ఉండనున్నాయి. యంగ్ డైరెక్టర్ అనిల్ రావుపూడి తెరకెక్కించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ సినిమాను గ్రాండ్ గా నిర్మిస్తున్నాడు. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా వస్తున్న ఈ సినిమాలో వెంకటేష్ భార్యగా ఐశ్వర్య రాజేష్, మాజీ గర్ల్ ఫ్రెండ్‌గా మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్ అన్నీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.. భీమ్స్ సిసిరోలియో ఈ సినిమాకు మ్యూజిక్ అందించాడు.. వెంకటేష్ నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ పై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి..

Related posts

రాజాసాబ్ : మాస్ ఐటెం సాంగ్ ప్లాన్ చేస్తున్న మేకర్స్..ఆ స్టార్ హీరోయిన్ తో చిందేయనున్నప్రభాస్

murali

సంక్రాంతికి వస్తున్నాం : వెంకీ మామ టార్చర్ కి ఒప్పేసుకున్న అనిల్ రావిపూడి..!!

murali

Leave a Comment