MOVIE NEWS

ఓటీటీ లో అదరగొడుతున్న “సంక్రాంతికి వస్తున్నాం”.. ఆ భారీ మూవీస్ రికార్డ్స్ సైతం బ్రేక్ చేసిందిగా..!!

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ నటించిన లేటెస్ట్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’.. స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ సంక్రాంతి కానుకగా ఏడాది జనవరి 14 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. ఇప్పటికే వెంకీ, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో f2,f3 సినిమాలు తెరకెక్కగా ఆ రెండు సినిమాలు మంచి విజయం సాధించాయి..

వార్ 2 : రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చిన చిత్ర యూనిట్..త్వరలో బిగ్ అప్డేట్..!!

తాజాగా వచ్చిన “సంక్రాంతికి వస్తున్నాం” సినిమాతో వెంకటేష్- అనిల్ రావిపూడి కాంబో హ్యాట్రిక్ హిట్ కొట్టారు.. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. కేవలం రూ. 50 కోట్లతో తెరకెక్కిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ రూ. 300 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ప్రాంతీయ భాషల్లో మాత్రమే విడుదలై 300 కోట్ల మార్క్ దాటిన తొలి తెలుగు సినిమాగా సంక్రాంతికి వస్తున్నాం మూవీ రికార్డ్ క్రియేట్ చేసింది. అంతేకాదు వెంకటేష్ కెరీర్ లోనే ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు మాస్ ప్రేక్షకులను కూడా ఎంతగానో ఆకట్టుకుంది.

ఇది ఇలా ఉంటే ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా మార్చి 1న జీ5 ఓటిటిలోకి వచ్చింది..థియేటర్ లో దుమ్మురేపిన ఈ సినిమా ఓటీటీలో కూడా అదరగొడుతుంది..కేవలం 12 గంటల్లోనే 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ నమోదు అయ్యాయని ఓటీటీ సంస్థ వెల్లడించింది..అలాగే ఇప్పటి వరకు ఈ సినీమాను దాదాపు 13 లక్షల మంది వీక్షించినట్లు తెలిపింది..ఇది జీ5 లో బిగ్గెస్ట్ రికార్డుగా పేర్కొనింది..ఈ సినిమాతో ఆర్ఆర్ఆర్, హనుమాన్ మూవీల రికార్డ్స్ సైతం బ్రేక్ అయినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి..వెంకటేష్ గత కొంతకాలంగా వరుస ప్లాప్స్ ఎదుర్కుంటూ వస్తున్నాడు.. కానీ ఈ ఏడాది ఆరంభంలోనే వెంకీ మామకు భారీగా కలిసి వచ్చిందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు..

 

Related posts

దేవర పార్ట్ 2 స్క్రిప్ట్ వర్క్ మొదలు.. షూటింగ్ ఎప్పటినుంచంటే..?

murali

మెగాస్టార్ లిస్ట్ లోకి మరో యంగ్ డైరెక్టర్.. ఈ లిస్ట్ ఇక్కడితో ఆగుతుందా..?

murali

ఫుల్ జోష్ లో వున్న బాలయ్య.. జెట్ స్పీడ్ లో “అఖండ 2” షూటింగ్..!!

murali

Leave a Comment