టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ఛాన్నాళ్లకు భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.. తన ఫేవరెట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వెంకటేష్ నటించిన లేటెస్ట్ మూవీ “ సంక్రాంతికి వస్తున్నాం”.. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14 న రిలీజ్ అయిన ఈ సినిమా సెన్సేషనల్ హిట్ అయింది..ఈ సినిమాను శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు గ్రాండ్ గా నిర్మించాడు.ఈ సంక్రాంతికి ‘గేమ్ చేంజర్’, ‘డాకు మహారాజ్’ చిత్రాలు సైతం రిలీజ్ కాగా ఆ రెండు పెద్ద సినిమాలను కూడా బీట్ చేసి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది.ఈ సంక్రాంతికి “ సంక్రాంతికి వస్తున్నాం “ సినిమా అసలైన బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. దాదాపు రెండు వారాల్లోనే బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లు కలెక్ట్ చేసి ఈ సినిమా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.
మెగాస్టార్ ” విశ్వంభర ” సమ్మర్ కైనా వచ్చేనా..?
ఇదిలా ఉంటే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ఫ్యామిలీ ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..’సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా డిజిటల్ రైట్స్ ని భారీ ధరకు ప్రముఖ ఓటీటీ సంస్థ జీ 5 కొనుగోలు చేసింది. ఈ మహాశివరాత్రికి ఓటీటీలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం..వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వచ్చిన మొదటి మూవీ” f2” సంచలన విజయం సాధించింది. ఆ తరువాత వచ్చిన f3 సినిమా f2 రేంజ్ లో కాకపోయిన మంచి వసూళ్లు చేసింది..
వెంకటేష్ లో వున్న కామెడీ యాంగిల్ ని దర్శకుడు అనిల్ ఎంతో అద్భుతంగా స్క్రీన్ పై ప్రెజెంట్ చేయడంతో ఆ సినిమాలు ఊహించని కలెక్షన్స్ రాబడుతున్నాయి.. “సంక్రాంతికి వస్తున్నాం “ సినిమాలో మ్యూజిక్ కి కూడా మెయిన్ హైలైట్ గా నిలిచింది.. ముఖ్యంగా గోదారి గట్టు సాంగ్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు.. భీమ్స్ సిసిరోలియా ఇంతటీ అద్భుతమైన ఆల్బమ్ ని అందించాడు.. ఈ సినిమాతో భీమ్స్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు సాధించాడు..