గ్లోబల్ స్టార్ రాంచరణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ” గేమ్ ఛేంజర్ “.. తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీనీ టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.. ఈ సినిమా జనవరి 10న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది.ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ కి జంటగా బ్యూటిఫుల్ హీరోయిన్లు కియారా అద్వానీ, అంజలి నటించారు. ఎస్ జే సూర్య, సునీల్, శ్రీకాంత్, నవీన్ చంద్ర వంటి స్టార్స్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు…
ఎస్ఎస్ఎంబి : చడీ చప్పుడు లేకుండా పూజా కార్యక్రమం.. ప్లీజ్ ఒక్క ఫోటో కావాలంటున్న ఫ్యాన్స్..!!
ఈ సినిమా ట్రైలర్ ని ఈరోజు (గురువారం) గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు..ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి చేతుల మీదుగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కానుంది..పుష్ప 2 సంధ్య థియేటర్ ఘటన ఎంత పెద్ద కాంట్రోవర్సి అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ ఘటన మూలంగా ఏకంగా అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. ఈ క్రమంలో సినీ పెద్దలు అప్రమత్తం అయ్యారు. రాంచరణ్ కొత్త మూవీ గేమ్ ఛేంజర్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ను కొండాపూర్ లోని ABM మాల్ లో ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ కు భారీ ఎత్తున ఫ్యాన్స్ వస్తే.. వాళ్లను కట్టడి చేయటం కోసం నిర్మాత దిల్ రాజు ముందస్తు పోలీస్ బందోబస్తు తీసుకున్నారు.
ప్రస్తుతం AMB మాల్ దగ్గర.. పదుల సంఖ్యలో పోలీస్ సిబ్బంది వున్నారు..పుష్ప సినిమా విషయంలో జరిగింది మళ్ళీ రిపీట్ కాకూడని కీలక జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం.. దాదాపురూ.400 కోట్లు బడ్జెట్ తో అద్భుతమైన విజువల్స్,ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో గేమ్ ఛేంజర్ తెరకెక్కింది.. దాదాపుగా 12500 థియేటర్స్ లో గేమ్ ఛేంజర్ సినిమాని రిలీజ్ చేస్తున్నట్లు సమాచారం.