MOVIE NEWS

చరణ్ తో సందీప్ రెడ్డి వంగా.. క్రేజీ కాంబో సెట్.. ఫ్యాన్స్ కి పండగే..?

గ్లోబల్ స్టార్ రాంచరణ్ ఈ ఏడాది “ గేమ్ ఛేంజర్ “ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ సినిమా ఫ్యాన్స్ ని తీవ్రంగా నిరాశ పరిచింది..దీనితో ఈ సారి సాలిడ్ హిట్ అందుకోవాలని ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు.. ఫ్యాన్స్ కి ఈ సారి భారీ హిట్ ఇవ్వాలని చరణ్ తన తరువాత సినిమాను ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సన డైరెక్షన్ లో బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు.. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది..రీసెంట్ గా చరణ్ బర్త్డే సందర్భంగా మేకర్స్ ఈ సినిమాకు సంబంధించి చరణ్ ఫస్ట్ లుక్, టైటిల్ ని అనౌన్స్ చేసారు.. ‘పెద్ది’ అనే పవర్ఫుల్ టైటిల్ తో వస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీ గ్లింప్స్ ని మేకర్స్ రీసెంట్ గా రిలీజ్ చేసారు..

ఓజీ : ఫస్ట్ సింగిల్ రిలీజ్ అప్పుడే.. తమన్ ఇంట్రెస్టింగ్ అప్డేట్..!!

స్పోర్ట్స్ ఆధారిత కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చరణ్ “ఆట కూలిగా” నటిస్తున్నాడు.. పెద్ది గ్లింప్స్ లో చరణ్ ఆడే ఐకానిక్ షాట్ ఎంతో పాపులర్ అయింది.. ఈ సినిమాలో బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.. ఆస్కార్ విన్నర్ ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.. ఇదిలా ఉంటే ఈ సినిమా తరువాత చరణ్ సుకుమార్ డైరెక్షన్ లో ఓ భారీ సినిమా చేయనున్నాడు.. ఆ సినిమా తరువాత చరణ్ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో నటిస్తున్నట్లు న్యూస్ వైరల్ అవుతుంది.. గతంలో అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన కథతో సందీప్ చరణ్ సినిమా చేయనున్నాడట..

స్పిరిట్, యానిమల్ పార్క్ మూవీస్ తరువాత రాంచరణ్ తో సందీప్ సినిమా చేయనున్నాడు..ఈ సినిమా సందీప్ స్టైల్ ఆఫ్ టేకింగ్ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా తెరకెక్కించనున్నట్లు సమాచారం.. సుకుమార్ తో చేసే సినిమా కూడా సరికొత్తగా ఉండనుందని తెలుస్తుంది..

 

Related posts

పుష్ప 2 : ఆ దేశంలో జాతర ఎపిసోడ్ తొలంగింపు..కారణం అదేనా..?

murali

బాలయ్య తో మరో ఊర మాస్ మూవీ ప్లాన్ చేస్తున్న ఆ స్టార్ డైరెక్టర్..!!

murali

షూటింగ్ దశలోనే “రాజాసాబ్” ప్రభాస్ లేకుంటే పని అయ్యేలా లేదుగా..!!

murali

Leave a Comment