టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.సమంత తండ్రి జోసెఫ్ ప్రభు మృతి చెందారు. ఈ విషయాన్ని సమంత తన ఇన్‌స్టా స్టోరీలో తెలిపారు… ‘నాన్నను ఇక కలవలేను’ అంటూ ఆమె హార్ట్ బ్రేకింగ్ ఎమోజీని పోస్ట్ చేసారు..దీంతో సమంతకు అభిమానులు, సన్నిహితులు సానుభూతిని తెలియజేస్తున్నారు.. నీ బాధ ఎవరూ తీర్చలేనిది ఈ సమయంలో ధైర్యంగా ఉండాలంటూ కామెంట్స్ చేస్తున్నారు.సమంత తండ్రి తెలుగు ఆంగ్లో-ఇండియన్. సమంత జీవితంలో ఆమె తండ్రి కీలక పాత్ర పోషించారు.తన సక్సెస్ లో, ఫెయిల్యూర్ లో తండ్రి వెన్నంటే ఉండి నడిపించారు… తనకు ప్రతి విషయంలో మద్దతుగా నిలిచారు.
మరో క్రేజీ సాంగ్ తో వస్తున్న పుష్ప రాజ్.. ప్రోమో అదిరిందిగా.. ఫుల్ సాంగ్ ఎప్పుడంటే..?
సమంత తండ్రి జోసెఫ్ ప్రభు ఇక లేరనే వార్త తెలియడంతో సినీ ప్రముఖులు, అభిమానులు ఆయనకు సంతాపం తెలియజేస్తున్నారు. జోసెఫ్ ప్రభు ఆత్మకు శాంతి చేకూరాలని పోస్ట్లు పెడుతున్నారు. అయితే జోసెఫ్ ప్రభు మరణవార్తకు కారణం ఏమనేది తెలియాల్సి ఉంది. కొన్నాళ్లుగా సమంత జీవితంలో ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. మనసారా ప్రేమించి, పెళ్లి చేసుకున్న నాగ చైతన్య నుంచి విడాకులు తీసుకోవడం ఆ తర్వాత మయోసైటిల్ వ్యాధి రావడంతో సమంత డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది.. కొన్నాళ్ళపాటు సినిమాలకు దూరమైంది..
మయోసైటీస్ వ్యాధికి చికిత్స తీసుకుంటూ కొన్నాళ్ళ పాటు అందరికి దూరంగా గడిపింది..ఈ మధ్యనే కాస్త రికవరీ అయి మళ్ళీ సినిమాలలో నటించడం మొదలు పెట్టింది.. పైకి నవ్వుతూ కనిపిస్తున్న ఆమె మనసులో ఏదో తెలియని బాధ.. ఎంతటీ సమస్యను అయిన చిరునవ్వుతో ఎదుర్కునే సమంతకు తండ్రి మరణం మరింత క్షోభకి గురిచేసింది..తన కష్టాల్లో ఎప్పుడూ తోడు వుండే తండ్రిని కోల్పోయింది.. అసలు సమంతకే ఎందుకు ఇలా జరుగుతుందని ఆమె అభిమానులు కూడా బాధపడుతున్నారు..తమ అభిమాన హీరోయిన్ సమంతకు మనస్శాంతి కలిగేలా చూడాలని వారు ఆ దేవుడిని ప్రార్థిస్తున్నారు..