పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస ప్లాప్స్ తరువాత నటించిన పాన్ ఇండియా మూవీ “సలార్ పార్ట్ 1: సీజ్ ఫైర్“.. కేజీఎఫ్ సిరీస్ తో సంచలనం సృష్టించిన ప్రశాంత్ నీల్ ఈ సినిమాను తెరకెక్కించాడు.. ఈ సినిమాతో ప్రభాస్ మరోసారి తన రేంజ్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.. సినిమా అంతా ప్రభాస్ ఊర మాస్ పెర్ఫార్మన్స్ తో అదరగోట్టాడు.. 2023 డిసెంబర్ లో రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయం సాధించింది.. ఏకంగా 700 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి అదరగొట్టింది..ఈ సినిమాలో ప్రభాస్ సరసన హాట్ బ్యూటీ శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది..త్వరలోనే ఈ బిగ్గెస్ట్ మూవీకి ప్రశాంత్ నీల్ సెకండ్ పార్ట్ తెరకెక్కించనున్నాడు..ఇదిలా ఉంటే ఈ బిగ్గెస్ట్ మూవీ “ సలార్” రీ రిలీజ్ కి సిద్ధం అయ్యింది. ఇందులోభాగంగా మార్చ్ 21న సలార్ పార్ట్ 1: సీజ్ ఫైర్ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం తదితర భాషలలో శుక్రవారం ఈ సినిమా రీ రిలీజ్ కానుంది.
SSMB 29 : మళ్ళీ లీక్.. రాజమౌళికి తలనొప్పిగా మారిన లీకుల గోల..!!
ప్రభాస్ కి పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ ఉండటంతో బాక్సాఫిస్ వద్ద సలార్ రీ రిలీజ్ సందడి మొదలైంది.అయితే ఇప్పటివరకూ సలార్ కోసం దాదాపుగా 550 షోలు ప్రసారం చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేశారు. దీంతో బుక్ మై షోలో దాదాపుగా లక్షకి పైగా టికెట్లు అమ్ముడయినట్లు తెలుస్తుంది.. రిలీజ్ కి ముందే సలార్ పార్ట్ 1 దాదాపుగా రూ.1.8 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు సమాచారం.. ఇందులో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ శాతం బిజినెస్ జరిగిందట.
కేవలం హైదరాబాద్ లోనే దాదాపు రూ.45 లక్షలకి పైగా కలెక్షన్స్ సాధించినట్లు తెలుస్తుంది. . కర్ణాటక, తమిళ్ లో కూడా ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ రాబట్టే అవకాశాలు ఉన్నాయి. అయితే హిందీ నుంచి మాత్రం పెద్దగా రెస్పాన్స్ రావడం లేదని తెలుస్తుంది.