Saif deserves all the recognition for Devara
MOVIE NEWS

ఎన్టీఆర్ తో పాటు సైఫ్ ని పొగిడితీరాల్సిందే

Saif deserves all the recognition for Devara
Saif deserves all the recognition for Devara

ఎన్టీఆర్ తో పాటు సైఫ్ ని పొగిడితీరాల్సిందే ( Saif – Devara )

Saif  Devara : దేవర చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేసిన పెర్ఫార్మన్స్ కి అభిమానులే కాదు కామన్ ఆడియన్స్ సైతం ముగ్ధులైపోయారు. రెండు పాత్రలకి తాను చూపించిన ఇంటెన్సిటీ వేరియేషన్స్ అలా ఉన్నాయి

ఆడియన్స్, రివ్యూయర్స్ అంతా ఎన్టీఆర్ ని ఫుల్ గా పొగిడేస్తున్నారు. ఆయుధ పూజ పాట లో అదిరిపోయే డాన్స్ తో యాక్షన్ ఘాట్లలో ఎన్టీఆర్ నటనను మెచ్చుకొని ప్రేక్షకుడు లేరు. దేవర చిత్రాన్ని ఎన్టీఆర్ తన భుజ స్కందాలపై మోశాడు అనడం లో సందేహం లేదు .

అయితే దేవర కి కేవలం ఒక్క ఎన్టీఆర్ మాత్రమే కాదు ఆయనతో కలిసి నటించిన సైఫ్ కూడా ఎన్టీఆర్ కి గట్టి పోటీ ఇచ్చారు. భైరా గా సైఫ్ అలీ ఖాన్ ఆహార్యం ఎన్టీఆర్ కి చక్కగా సరితూగడమే కాదు.. హీరో కు తగ్గ విలన్ అనేలా సైఫ్ పాత్రను కొరటాల డిజైన్ చేసారు. ఎదురుగా సైఫ్ ఉండడం వలనే ఎన్టీఆర్ కేరెక్టర్ బలంగా హైలెట్ అయ్యింది అనే వాళ్ళు లేకపోలేదు

Read Also : విశ్వంబర ఎప్పటికి పూర్తయ్యెను ??

ఎన్టీఆర్ వెన్నంటే ఉంటూ ప్రతీకార జ్వాలతో రగిలిపోయే పాత్రలో సైఫ్ నిజంగా అదరగొట్టేసాడు. డిఫ్రెంట్ డిఫ్రెంట్ షేడ్స్ తో సైఫ్ అలీ ఖాన్ భైర పాత్రకు న్యాయం చేసాడు. సీరియస్ గా ఇచ్చే ఎక్స్ ప్రెషన్లు, డబ్బింగ్ వేరే వారితో చెప్పించినా.. క్రూరత్వం గా అవి బాగా పేలాయి. ఎన్టీఆర్ కి సరిసమానమైన పోటీ ని సైఫ్ ఇచ్చారనడంలో సందేహం లేదు. అందుకే అనేది ఎన్టీఆర్ తో పాటుగా ఆయన్ని కూడా పొగడాలి అని.

Follow us on Instagram

Related posts

అజయ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ రెడీ.. ఆ హీరో తో సినిమా కాన్ఫమ్డ్.

filmybowl

ఆ స్టార్ హీరోల ఫ్యాన్స్ కి కోపం తెప్పించిన శ్రీలీల.. అసలు ఏం జరిగిందంటే..?

murali

గుంటూరు కారం నీ అదే దెబ్బేసింది కానీ, దేవరకు అది ప్లస్ అయింది

filmybowl

Leave a Comment