పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు.. గత ఏడాది ప్రభాస్ నటించిన “కల్కి” సినిమా తన కెరీర్ లో మరో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది..ఏకంగా 1200 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.. ప్రస్తుతం ప్రభాస్ మారుతీ డైరెక్షన్ లో “రాజాసాబ్” అనే మూవీ చేస్తున్నాడు.. ఈ సినిమా ఈ ఏడాది ఏప్రిల్ లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది.. అలాగే స్టార్ డైరెక్టర్ హను రాఘవపూడి డైరెక్షన్ లో ప్రభాస్ “ఫౌజీ “ అనే ఇంట్రెస్టింగ్ మూవీ చేస్తున్నాడు..ఈ సినిమా 1940ల కాలం నాటి యుద్ధ నేపథ్యంతో పాటు ఎమోషన్స్ తో కూడిన కథ కావడంతో మరింత ఇంట్రెస్టింగ్‌గా మారింది.
బాలయ్యకి పద్మభూషణ్.. భువనేశ్వరి పార్టీ.. హాజరవని ఎన్టీఆర్.. కారణం అదేనా..?
ఇప్పటికే ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్‌గా ఇమాన్వీ ఎంపికైనప్పటికీ, చిత్రంలో ఓ కీలకమైన ఫ్లాష్‌బ్యాక్ పార్ట్ లో ఓ కీలకమైన పాత్ర కోసం మరో హీరోయిన్ ని ఎంపిక చేయాల్సి ఉందని సమాచారం. ఈ పాత్ర కధని మలుపు తిప్పేలా ఉంటుందని తెలుస్తుంది..అయితే ఈ పాత్ర కు మేకర్స్ కొంతకాలంగా సరైన నటి కోసం వెతుకుతున్నారు.న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి పేరు పరిశీలనలో ఉందని ఇండస్ట్రీలో న్యూస్ వైరల్ అవుతుంది..సాయి పల్లవి గతంలో హను రాఘవపూడి తెరకెక్కించిన ‘పడి పడి లేచే మనసు’మూవీలో హీరోయిన్ గా నటించింది.
దీనితో దర్శకుడు హను రాఘవపూడి ఆమెను సంప్రదించినట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం తండేల్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ మధ్య లో హను రాఘవపూడి, సాయి పల్లవి భేటీ అయ్యారని టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సాయిపల్లవికి కథ వినిపించగానే ఆ పాత్ర ఎంతో ఆసక్తికరంగా అనిపించిందట. తండేల్ ప్రమోషన్స్ పూర్తయిన తర్వాత ఈ సినిమాపై ఆమె క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది..