Sai Durga Tej This time coming up with pan india film
MOVIE NEWS

మరో సారి హార్రర్ థ్రిల్లర్ సినిమాలో ఆ హీరో…. ఈ సారి గురి పాన్ ఇండియా

Sai Durga Tej This time coming up with pan india film
Sai Durga Tej This time coming up with pan india film

Sai Durga Tej film : సాయి దుర్గ్ తేజ్ కెరీర్లోనే బిగ్టెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన చిత్రం విరూపాక్ష. హార్రర్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ చిత్రం చాలా మాంచి వసూళ్లు రాబట్టింది. దాదాపు గా వంద కోట్లు కలెక్ట్ చేసి గత ఏడాది బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలిచింది. కానీ ఆ సినిమాని పాన్ ఇండియా కి తీసుకెళ్ళలేదు. అందుకే ఇప్పుడు తేజు మళ్లీ ఓ అలాంటి ఒక భారీ చిత్రంలో నటిస్తున్నాడు. ఆ జానర్ కి పాన్ ఇండియా లెవెల్ లో మంచి క్రేజ్ వుండడం తొ ఈ సారి ఎత్తి పరిస్థితుల్లో పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేయడానికి చిత్ర బృందం మొదటి నుంచి ప్రణాళికలు సిద్ధం చేసింది. దానికి తగ్గట్టు గానే అడుగులు వేస్తుంది.

రోహిత్ కేపీ అనే కొత్త దర్శకుడునీ పరిచయం చేస్తూ రూపొందిస్తున్న సినిమా ఇది. దీన్ని పాన్ ఇండియా స్థాయిలో ఐదు భాషల్లో రూపొందిస్తుండడం విశేషం. ఈ మూవీ బడ్జెట్ కూడా వంద కోట్లను దాటుతుంది అంటున్నారు.

ఈ ఏడాది ప్రశాంత్ వర్మ – తేజ సజ్జా తో చేసిన
హనుమాన్’ సినిమా తో భారీ విజయాన్నందుకున్న ‘ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్’ బేనర్ మీద నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.

ఈ చిత్రానికి పని చేస్తున్న టెక్నికల్ టీం కూడా పేరున్న వాళ్లనే తీసుకుంటున్నారు. కంగువ సహా పలు భారీ చిత్రాలకు ఛాయాగ్రహణం అందించిన సినిమాటోగ్రాఫర్ వెట్రి పళనిస్వామి ఈ చిత్రానికి పని చేస్తున్నాడు అంటేనే అర్థం చేసుకోవచ్చు.

ఇప్పుడు తాజాగా ఈ మూవీకి సంగీత దర్శకుడునీ కూడా ఖరారు చేసింది. కన్నడలో ఇప్పుడు రవి బర్సూర్ తో పాటుగా అత్యంత డిమాండ్ ఉన్న సంగీత దర్శకుడు అజనీష్ లోక్‌నాథ్‌ను తేజు సినిమా కోసం మరో సారి తీసుకున్నారు.

Also Read : సామాజిక కథాంశం తో వస్తా అంటున్న చిరు ??

‘విరూపాక్ష’కు కూడా అజనీషే సంగీత దర్శకుడు ఆ సినిమా లో పాటలు, అదిరిపోయే బ్యాగ్రౌండ్ స్కోర్ అందించి తెలుగు ప్రేక్షకుల మనసు దోచాడు అజనీష్. దీని కంటే ముందు అజయ్ భూపతి దర్శకత్వం లో వచ్చిన ‘మంగళవారం’ సినిమాకు కూడా మ్యూజిక్ చేశాడు. ఆ సినిమా నేపథ్య సంగీతానికి కూడా చాలా మంచి ప్రశంసలు దక్కాయి. మిస్టరీ థ్రిల్లర్ సినిమాలకు తన మ్యూజిక్ బాగా సెట్ అవుతుంది.

తేజు ప్రస్తుతం చేస్తున్నది చారిత్రక నేపథ్యం ఉన్న థ్రిల్లర్ మూవీ. అజనీష్ మరోసారి తేజు సినిమాకు అదిరిపోయే మ్యూజిక్ అందిస్తాడు అనడం లో సందేహం లేదు. ఇందులో తేజు నెవర్ బిఫోర్ లుక్‌లో కనిపించనున్నాడు. వచ్చే ఏఢాది వేసవిలో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. చిత్రానికి ఇంకా పేరు ఖరారు చేయాల్సి ఉంది

Follow us on Instagram 

Related posts

హరిహర వీరమల్లు.. విశ్వరూపం ఇది

filmybowl

పుష్ప 2 : ఆ దేశంలో జాతర ఎపిసోడ్ తొలంగింపు..కారణం అదేనా..?

murali

మరో ప్లాప్ దర్శకుడి చేతిలోకి “గేమ్ ఛేంజర్”.. రాంచరణ్ మూవీని ఇక ఆ దేవుడే కాపాడాలి..!!

murali

Leave a Comment