MOVIE NEWS

RRR : తారక్ ని కొరడాతో కొట్టిన చరణ్.. వీడియో వైరల్..?

ఇండియన్ సినీ హిస్టరీలో ఆర్ఆర్ఆర్ సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు..మొదటి సారి ఒక తెలుగు సినిమా ఇంటర్నేషనల్ స్టేజ్ పై ఆస్కార్ అందుకొని చరిత్ర సృష్టించింది.. ఆర్ఆర్ఆర్ సినిమాతో దర్శకధీరుడు రాజమౌళి ప్రపంచవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించాడు..తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవరికీ సాధ్యం కానీ విధంగా జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరితో బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ సినిమా చేసి భారీ విజయాన్ని అందుకున్నాడు.. ఇటు నందమూరి, అటు మెగా ఫ్యామిలీ అభిమానులను ఏ మాత్రం డిస్సపాయింట్ చేయకుండా ఇద్దరి ఫ్యాన్స్ అంచనాలు బ్యాలన్స్ చేస్తూ రాజమౌళి ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు.

పబ్లిక్ ప్లేస్ లో వున్నప్పుడు ఎలా బిహేవ్ చేయాలో నేర్చుకో.. బన్నీపై సురేష్ బాబు షాకింగ్ కామెంట్స్..!!

ఈ సినిమా వచ్చి దాదాపు మూడు సంవత్సరాలు అవుతున్నప్పటికి ఈ సినిమాకు సంబంధించిన ఏదో ఒక విషయం రోజు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూనే ఉంటుంది.ఇదిలా ఉంటే ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ సినిమాకు రాజమౌళి ఓ డాక్యుమెంటరీ రూపొందించారు..”ఆర్ఆర్ఆర్ బిహైండ్ అండ్ బియాండ్ “ అనే టైటిల్ తో వచ్చిన ఈ డాక్యుమెంటరీ రీసెంట్ గా మేకర్స్ నెట్ ఫ్లిక్స్ ఓటిటిలో రిలీజ్ చేసారు.. ఇందులో ఒక సీన్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండటంతో ఫ్యాన్స్ తెగ షేర్ చేస్తున్నారు..

కొమరం భీముడో అనే సాంగ్ లో రామ్ చరణ్ ఎన్టీఆర్ ని కొరడాతో కొట్టినప్పుడు అనుకోకుండా అతనికి ఆ కొరడా దెబ్బ గట్టిగా తగిలిందని వెంటనే రామ్ చరణ్ వచ్చి ఎన్టీఆర్ ని హగ్ చేసుకుంటాడు. దాంతో ఎన్టీఆర్ నాకేం తగలలేదు అంటూ నవ్వేస్తాడు. దాంతో రామ్ చరణ్ కూడా వెంటనే నవ్వేస్తాడు… ఇక ఇప్పుడు ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. వీళ్లిద్దరి మధ్య ఎలాంటి బాండింగ్ ఉందో ఈ వీడియో చూస్తేనే తెలుస్తుంది..

Related posts

గేమ్ ఛేంజర్ : భారీ ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్న దిల్ రాజు.. స్పెషల్ గెస్టులుగా ఆ స్టార్ డైరెక్టర్స్..!!

murali

పుష్ప 3 నుంచి పవర్ ఫుల్ డైలాగ్ లీక్.. మాములుగా లేదుగా..?

murali

తన డ్రీమ్ డైరెక్టర్ డైరెక్షన్ లో మూవీకి సిద్ధమవుతున్న నాని..!!

murali

Leave a Comment