టాలీవుడ్ యంగ్ హీరో నితిన్, శ్రీలీల జంటగా తెరకెక్కిన ‘రాబిన్‌హుడ్’ సినిమా మార్చ్ 28 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో రిలీజయింది. ఈ సినిమాలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ గెస్ట్ రోల్ లో నటించిన సంగతి తెలిసిందే..ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ గా వున్న డేవిడ్ వార్నర్ ఐపీఎల్ టీం సన్ రైజెస్ హైదరాబాద్ టీం కి కెప్టెన్ గా చేసి కప్ కప్ కూడా తీసుకొచ్చాడు.. ఐపిఎల్ పుణ్యమా అని వార్నర్ మామకి తెలుగు పీపుల్ ఎంతగానో కనెక్ట్ అయ్యారు..ఎంతలా అంటే తెలుగులో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీస్ లో స్పెషల్ సీన్స్, సాంగ్స్ వార్నర్ రీల్స్ చేసే వాడు.. ఆ రీల్స్ ఇప్పటికీ ఎంతో పాపులర్.. దీనీతో హైదరాబాద్ అన్నా, తెలుగు పీపుల్ అన్నా వార్నర్ కి ఎంతో ఇష్టంగా మారింది.
ఆ స్టార్ డైరెక్టర్ తో వెంకీ మామ.. క్రేజీ కాంబో ఫిక్స్..!!
రీల్స్ తో తెలుగు వాళ్లకు దగ్గరైన డేవిడ్ వార్నర్ రాబిన్ హుడ్ సినిమాలో గెస్ట్ రోల్ చేయడంతో నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి..సినిమాలో డేవిడ్ వార్నర్ క్లైమాక్స్ లో వచ్చి ఓ రెండు నిముషాలు నెగిటివ్ షేడ్స్ లో కనిపిస్తాడు. ఇది కేవలం ఆ పాత్ర ఇంట్రడక్షన్ లా ఉంటుంది. దీంతో ఇంతేనా అని డేవిడ్ ఫ్యాన్స్ నిరుత్సాహ పడ్డారు. అయితే సినిమా చివర్లో డేవిడ్ వార్నర్ ని చూపిస్తూనే రాబిన్ హుడ్ సినిమాకు సీక్వెల్ ఉంటుంది అని మేకర్స్ ప్రకటించారు. ఆ సీక్వెల్ కి ‘బ్రదర్ హుడ్ ఆఫ్ రాబిన్ హుడ్’ అనే టైటిల్ కూడా ప్రకటించడం విశేషం..
ఆ సీక్వెల్ లో డేవిడ్ వార్నర్ మెయిన్ విలన్ అని మేకర్స్ క్లైమాక్స్ లో హింట్ ఇచ్చారు.అయితే ప్రస్తుతానికి రాబిన్ హుడ్ సినినాకు యావరేజ్ టాక్ వినిపిస్తుంది.కామెడీ వున్నా కానీ రొటీన్ స్టోరీ కావడంతో ప్రేక్షకులకు అంత కిక్ ఇవ్వలేక పోతుంది అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు..