Rishab shetty to do Jai hanuman
MOVIE NEWS

‘జై హనుమాన్’ లో నటించేది ఆ దర్శకుడేనా????

Rishab shetty to do Jai hanuman
Rishab shetty to do Jai hanuman

Rishab shetty Jai hanuman : ఈ ఏడాది సంక్రాంతికి పెద్ద సినిమా పోటీ లో ఉన్న వెనక్కి తగ్గకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన పాన్ ఇండియా చిత్రం హనుమాన్. అలా వచ్చినా ఆ చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

తేజ సజ్జని పాన్ ఇండియా కథానాయకుడిగా చేసింది ఈ సినిమా. ఇక ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం భారీ హిట్‌గా నిలిచి తనని మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ ను చేసింది , వందల కోట్ల కలెక్షన్లు సాధించి అన్ని ప్రాంతాల్లో ప్రశంసలు పొందింది.

ఈ సినిమాకి సీక్వెల్ గురించి మొదటి పార్ట్ ఎండింగ్ లోనే దర్శకుడు హింట్ ఇచ్చాడు. సంక్రాంతి 2025లో విడుదల చేస్తామని ప్రకటించిన, ఇప్పటివరకు ఐతే సినిమా స్టార్ట్ అవ్వలేదు. కానీ, ఈ సినిమాలో మెయిన్ లీడ్ హీరో గా నటించబోయే వ్యక్తి ఎవరన్న దానిపై మొదటి నుంచి ఆసక్తి నెలకొంది.

ఇప్పటికి జై హనుమాన్ లో లీడ్ రోల్ అంటే అందరికీ ఇష్టమైన హనుమంతుడి కేరక్టర్ ఎవరు చేస్తున్నారో బయటికొచ్చింది.
కాంతార చిత్రంతో బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించి, దేశం మొత్తాన్ని తన వైపు, తన ఇండస్ట్రీ వైపు చూసేలా చేసిన రిషబ్ శెట్టి జై హనుమాన్ లో ప్రధాన పాత్ర పోషించనున్నారని ఇండస్ట్రీ లో వినిపిస్తున్న మాట.

రిషబ్ డైరెక్టర్ గానే కాకుండా, నటుడిగా కూడా కాంతర లో తన సత్తా చాటాడు అందుకే దర్శకుడు ఆ సినిమా నీ దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాలో లీడ్ రోల్ కోసం తీసుకున్నారని తెలుస్తోంది. రిషబ్ శెట్టి హనుమాన్ సీక్వెల్ లో హీరోగా నటిస్తే ఆ సినిమాకు ఓ రేంజ్ లో హైప్ క్రియేట్ అవుతుందని చెప్పవచ్చు.

ప్రస్తుతానికి కాంతార2 లో బిజీగా ఉన్న రిషబ్ కు ఓక పక్కన దర్శకుడిగా అవకాశాలు వస్తున్నాయి అదే టైం లో హీరోగా కూడా అవకాశాలు గట్టిగానే వస్తున్నాయి, సో ఆ పాత్ర కోసం ప్రశాంత్ వర్మ కలవగానే ఈ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచేసినట్లు తెలుస్తుంది.

Read Also : వెంకీ మామ గోయింగ్ బ్యాక్…

ఈ వార్త ఆఫీషియల్ ఐతే జై హనుమాన్ సినిమాకి ఎక్కడ లేని క్రేజ్ వచ్చినట్లే. రిషబ్ తన నటనతో ప్రాధాన్యత కలిగిన పాత్రలకు కొత్తదనం తెస్తాడని అందరికీ తెలుసు. ఇక ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో రిషబ్ హీరోగా నటిస్తే, అది కేవలం తెలుగు సినిమా మాత్రమే కాకుండా, మొత్తం భారతీయ ప్రేక్షకులను అలరించే ప్రాజెక్ట్‌గా నిలుస్తుంది. రిషబ్ శెట్టి పేరు కేవలం దక్షిణాది సినీ పరిశ్రమకు మాత్రమే పరిమితం కాకుండా, కాంతార సినిమాతో దేశ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపును సంపాదించాడు.

ఇక ఈ ప్రాజెక్ట్ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో నిర్మించే అవకాశం ఉంది. తెలుగు పరిశ్రమలో ఈ సంస్థకు ఉన్న స్ధాయి, మార్కెట్ వలన ఈ ప్రాజెక్ట్ మరింత భారీగానే ఉండనుంది. గతంలో కేజీఎఫ్ వంటి ప్రాజెక్టులు పాన్ ఇండియా స్థాయిలో వందల కోట్ల వసూళ్లు సాధించిన విధంగా, జై హనుమాన్ కూడా అలాంటి ఘన విజయాన్ని అందుకోవాలని మేకర్స్ భావిస్తున్నారు. ఇక ఈ కాంబినేషన్ ఎంతవరకు నిజం అనేది త్వరలోనే తెలుస్తుంది.

Follow us on Instagram 

Related posts

గ్లోబల్ వైడ్ అదరగొడుతున్న ‘దేవర’.. ఇప్పటికీ ట్రెండింగ్ లోనే..!!

murali

ఇంకో ఐదేళ్లు రాజమౌళి జైల్లోనే మహేష్.. నిరాశలో ఫ్యాన్స్..!!

murali

తండేల్‌ లో శివరాత్రి సంబరం

filmybowl

Leave a Comment