MOVIE NEWS

RC17 : ఆ టాలెంటెడ్ హీరోయిన్ ని సెట్ చేస్తున్న సుకుమార్.?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం నటిస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘గేమ్ చేంజర్’ ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తుండగా టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా విడుదలకు సిద్ధంగా వుంది.. ఈ సినిమాను మేకర్స్ వచ్చే ఏడాది జనవరి 10 న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు.ఇదిలా ఉంటే రాంచరణ్ తన తరువాత సినిమాపై ఫోకస్ పెట్టారు.. తన తరువాత సినిమాను ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే..’RC 16′ అనే వర్కింగ్ టైటిల్ తో  ఈ సినిమా తెరకెక్కుతుంది.. ఈ మూవీని వీలైనంత వేగంగా ఫినిష్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

NC24: నాగచైతన్య కొత్త సినిమా పోస్టర్ అదిరిందిగా..!!

ఈ సినిమాలో బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. పీరియాడికల్ జోనర్ లో విలేజ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా ఈ మూవీ ఉండబోతోందని సమాచారం.. ఈ మూవీ తర్వాత రామ్ చరణ్ సుకుమార్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కబోతుంది..ఇప్పటికే ఈ సినిమా అనౌన్స్ మెంట్ కూడా అయిపొయింది. ప్రస్తుతం ‘పుష్ప 2’ సినిమాని ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చే పనిలో సుకుమార్ చాలా బిజీగా ఉన్నారు. దీని తర్వాత కొంత గ్యాప్ తీసుకొకుని ‘RC 17’ మూవీ స్క్రిప్ట్ పైన వర్క్ చేయబోతున్నట్లు సమాచారం.ఇప్పటికే కథ సిద్ధం కాగా బౌండెడ్ స్క్రిప్ట్ సిద్ధం కావడానికి కాస్త సమయం పట్టొచ్చు.

ఇదిలా ఉంటే ‘RC 17’ మూవీ గురించి ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెగ వైరల్ అవుతుంది..ఈ మూవీలో హీరోయిన్ గా సాయి పల్లవిని తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం.అయితే సుకుమార్ తన సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్స్  చాలా బలంగా డిజైన్ చేస్తారు. అందుకే ఈ సారి ‘RC 17’ కోసం సాయి పల్లవి అయితే బెస్ట్ ఛాయస్ అని అనుకుంటున్నట్లు సమాచారం.ప్రస్తుతం ఆమె తో చర్చలు జరుగుతున్నాయని తెలుస్తుంది..కథ నచ్చితేనే సాయి పల్లవి మూవీకి ఒకే చెబుతుందని సమాచారం.

Related posts

పుష్ప 2 : పాట్నా ఈవెంట్ పై సిద్దార్థ్ షాకింగ్ కామెంట్స్.. వైరల్..!!

murali

ఛత్రపతి శివాజీగా కాంతార నటుడు.. ఫస్ట్ లుక్ అదిరిందిగా..!!

murali

అడ్వాన్స్ బుకింగ్స్ లో జోరు చూపిస్తున్న పుష్పరాజ్..భారీ ఓపెనింగ్స్ గ్యారెంటీ..!

murali

Leave a Comment