గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ గేమ్ చేంజర్ “.. తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయింది.. రాంచరణ్ ఛాన్నాళ్లకు సోలో హీరోగా ప్రేక్షకుల ముందుకు రావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.. కానీ ఈ సినిమా రిజల్ట్ చరణ్ కు కోలుకోలేని దెబ్బ కొట్టింది..ఈ సినిమాను స్టార్ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు.. రొటీన్ కథ, స్క్రీన్ ప్లే తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులకు బోర్ కొట్టించింది.. దీనితో ఈ సంక్రాంతి చరణ్ కి అంతగా కలిసి రాలేదు..
రాంచరణ్ ప్రస్తుతం ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సన డైరెక్షన్ లో ఓ బిగ్గెస్ట్ స్పోర్ట్స్ డ్రామా లో నటిస్తున్నాడు.. ఈ సినిమాలో చరణ్ సరసన దేవర బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు..ఈ సినిమా తరువాత రాంచరణ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్లో ఓ భారీ సినిమా చేస్తున్నాడు.. ఇప్పటికే వీరి కాంబినేషన్ లో వచ్చిన రంగస్థలం బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే..దీంతో సుకుమార్ చరణ్ తో ఈసారి ఎలాంటి సినిమా చేస్తాడనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఈ నేపథ్యంలో తాజాగా ఓ విషయం నెట్టింట వైరల్ అవుతుంది.చరణ్ తో సుకుమార్ తెరకెక్కించే సినిమా పక్కా యాక్షన్ ప్యాక్డ్ చిత్రమని తెలిసింది. సుకుమార్ గత చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంటుందని సమాచారం..సిటీ బ్యాక్ డ్రాప్ లో సాగే ఓ డిఫరెంట్ జోనర్ లో ఈ సినిమా ఉండనుంది.ఈ సినిమాలో రాంచరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడని సమాచారం…