MOVIE NEWS

RC17 : ఆ క్రేజీ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ కాబోతుందా..?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ కాంబినేషన్ లో సినిమా అంటేనే ప్రేక్షకుల్లో ఊహించని అంచనాలు ఏర్పడ్డాయి.. వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో వచ్చిన రంగస్థలం సినిమా ఎంత పెద్ద బ్లాక్‌బస్టర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఆ సినిమాలో చిట్టిబాబు, రామలక్ష్మి పాత్రలు ప్రేక్షకుల మనసుల్ని దోచేశాయి. ఇప్పుడీ సెన్సేషనల్ కాంబోలో మరో సినిమా వస్తుందటంతో ఎలాంటి కాన్సెప్ట్ తో రాబోతున్నారో అనే ఆసక్తి ప్రేక్షకులలో పెరిగిపోయింది. ప్రస్తుతం చరణ్ RC16 షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు..సుకుమార్ తన నెక్స్ట్ సినిమా స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నారు. త్వరలోనే వీరి కాంబినేషన్‌లో RC17 సెట్స్‌పైకి వెళ్లబోతోంది.

వావ్ : ఎన్టీఆర్ లేటెస్ట్ యాడ్ చూసారా.. వీడియో వైరల్..!!

రీసెంట్ గా వచ్చిన పుష్ప 2 వరల్డ్ వైడ్ గా 1800 కోట్లకు పైగా బాక్సాఫీస్ వసూళ్లను అందుకున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ కెరీర్‌లోనే అతిపెద్ద విజయం సాధించిన చిత్రంగా ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది..దీనితో RC17 పై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను చరణ్ పాన్ ఇండియా మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేస్తున్నట్లు సమాచారం. కంటెంట్‌ పరంగా ఇది అంతర్జాతీయ స్థాయిలోనూ గుర్తింపు తెచ్చుకునేలా ఉండబోతోందట. అయితే ఇందులో హీరోయిన్ ఎవరన్నదానిపై తెగ చర్చ జరుగుతోంది. ప్రస్తుతం సమంత పేరు గట్టిగా వినిపిస్తుండగా..మళ్లీ ఆ క్రేజీ కాంబోని రిపీట్ చేయాలని సుకుమార్ భావిస్తున్నారట.

కానీ గత రెండేళ్లుగా సమంత తక్కువ సినిమాలు చేసింది.. త్వరలో తెలుగులో భారీ సినిమాలు చేస్తా అని సమంత ప్రకటించింది..మరీ సమంత చరణ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఓకే.. లేకుంటే మరో ఆప్షన్ గా రష్మికను ఎంపిక చేస్తారా అనేది ప్రశ్నగా మారింది..అయితే సుకుమార్ ఓన్లీ కంటెంట్ బేస్డ్ క్యాస్టింగ్ చేయడం వల్ల స్టార్ ఫాక్టర్ కంటే క్యారెక్టర్‌కు తగ్గట్టు నిర్ణయం తీసుకుంటారని చాలా మంది భావిస్తున్నారు.

 

Related posts

గేమ్ ఛేంజర్ ట్రైలర్ కి సూపర్ రెస్పాన్స్.. రిలీజ్ అయిన 24 గంటల్లో ఎన్ని వ్యూస్ అంటే..?

murali

పుష్ప 2 :ఆ కీలక సన్నివేశాలు ఎడిట్ చేసిన సుకుమార్.. దాని కోసమేనా..?

murali

గేమ్ ఛేంజర్ : “నానా హైరానా” లిరికల్ సాంగ్ కు సూపర్ రెస్పాన్స్..!!

murali

Leave a Comment