గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “గేమ్ ఛేంజర్ “ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ మొదలై మూడేళ్లు అయినా ఇంకా షూటింగ్ పూర్తి కాలేదు.. కొన్ని అనుకోని కారణాల వల్ల ఈ సినిమా లేట్ అవుతూ వచ్చింది..అయితే ఈ సినిమాలో రాంచరణ్ పార్ట్ షూటింగ్ పూర్తి కావడంతో రాంచరణ్ తన తరువాత సినిమాపై ఫోకస్ పెట్టారు. గేమ్ ఛేంజర్ సినిమా జనవరి 10 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది..
ఈ సినిమాలో రాంచరణ్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ “కియారా అద్వానీ” హీరోయిన్ గా నటించింది.అలాగే ఎస్. జె. సూర్య,,సునీల్,శ్రీకాంత్, నవీన్ చంద్ర కీలక పాత్రలలో నటించారు. ఇదిలా ఉంటే రాంచరణ్ తన తరువాత సినిమా ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు డైరెక్షన్ లో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్ హాట్ బ్యూటీ “ జాన్వీ కపూర్ “ హీరోయిన్ గా నటిస్తుంది..తాజా సమాచారం మేరకు.. మైసూరులో ఈ సినిమా మీనీ షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేసారు. కర్ణాటక- మైసూరులో కీలక సన్నివేశాల చిత్రీకరణను ముగించి, తదుపరి హైదరాబాద్ బూత్ బంగ్లాకు షెడ్యూల్ ని షిఫ్ట్ చేసారని సమాచారం.
స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు మరో బిగ్ షాక్..!!
మైసూర్ షెడ్యూల్ లో బుచ్చి బాబు సనా రామ్ చరణ్, జాన్వీ కపూర్, దివ్యేందు శర్మ , సత్యలపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించారు. డిసెంబర్ 10 నుంచి మొదలయ్యే షెడ్యూల్ లో మేకర్స్ హైదరాబాద్ భూత్ బంగ్లాలో కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు సమాచారం.. ప్రస్తుతం దీని కోసం మేకర్స్ సెట్‌ను నిర్మిస్తున్నారు.ఇదిలా ఉంటే రామ్ చరణ్- బుచ్చిబాబు చిత్రానికి ఏ.ఆర్.రెహమాన్ ని ఏరి కోరి ఎంపిక చేసుకున్నారు. స్పోర్ట్స్ డ్రామాకు రెహమాన్ సంగీతం జీవం పోస్తుందని వారు భావించారు.కానీ వ్యక్తిగత కారణాలతో రెహమాన్ ఈ సినిమా నుంచి తప్పుకున్నారని ప్రచారం జరుగుతుంది.రెహమాన్ స్థానంలో రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ ని ఎంపిక చేసుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.