గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “RC16”.. ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు సన తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది..ఈ సినిమా, రెగ్యులర్ స్పోర్ట్స్ డ్రామాగా కాకుండా, పూర్తి మాస్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కుతుంది.రంగస్థలం వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత చరణ్ మళ్లీ అలాంటీ నేటివిటీ నేపథ్యంలో కనిపించబోతున్నాడన్న టాక్ వైరల్ అవుతుంది… ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన లుక్స్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి.
కార్తీ “ఖైదీ 2” మరింత ఆలస్యం.. కారణం అదేనా..?
ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్ మరియు సుకుమార్ రైటింగ్స్ కలిసి గ్రాండ్ గా నిర్మిస్తున్నాయి..ఈ సినిమా లోని ప్రత్యేకత ఏమిటంటే స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ సినిమాలు ఒక ఆట చుట్టూ నడుస్తుంటాయి. కానీ RC16 మాత్రం ఆ నిబంధనను బ్రేక్ చేసి, క్రికెట్, కుస్తీ, కబడ్డీ వంటి వేరువేరు ఆటలను కథలో మిక్స్ చేస్తుందట.ఈ సినిమాలో రామ్ చరణ్ క్యారెక్టర్ ‘ఆట కూలీ’గా ఉంటుందని సమాచారం.. ఈ సినిమాలో ఓ ప్రత్యేకమైన కోచ్ పాత్ర ఉందని తెలుస్తుంది..ఆ క్యారెక్టర్‌ను కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ పోషించబోతున్నట్లు సమాచారం.
ఈ సినిమాలో ఆయనతో పాటు జగపతిబాబు, మేఘన్ రాజ్ వంటి నటులు కీలకమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా కథ కేవలం స్పోర్ట్స్ బేస్డ్ మాత్రమే కాదు ఫ్యాన్స్ కి కావాల్సిన మాస్, ఎమోషన్ సీన్స్ కూడా వుంటాయని తెలుస్తుంది..ఈ సినిమాలో రాంచరణ్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.. అలాగే ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు.. గేమ్ ఛేంజర్ ఫెయిల్ అవ్వడంతో ఈ సినిమాపై ఫ్యాన్స్ భారీగా ఆశలు పెట్టుకున్నారు..