MOVIE NEWS

RC16 : గ్లోబల్ స్టార్ మూవీలో మున్నా భయ్యా.. లుక్ అదిరిందిగా..!!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్..వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.. స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీకి ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి..ఇదిలా ఉంటే రామ్ చరణ్ తన తరువాత సినిమాను ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు సన దర్శకత్వంలో చేస్తున్నాడు..RC16 అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా తెరకెక్కుతుంది..

రాంచరణ్ ఈ సినిమా షూటింగ్లో పాల్గొనడానికి సన్నద్ధమయ్యాడు. ఈ నేపథ్యంలో సినిమా డైరెక్టర్ బుచ్చిబాబు సోషల్ మీడియాలో వరుస అప్డేట్స్ ఇస్తున్నాడు..రెండు రోజుల క్రితం హీరో రామ్ చరణ్ కడప దర్గాకు వెళ్లిన సమయంలో ఆయన వెంట బుచ్చిబాబు కూడా వెళ్లి అక్కడ సినిమా సంబంధించిన స్క్రిప్టుకు పూజలు నిర్వహించారు. ఆ తర్వాత కర్ణాటకలోని ప్రసిద్ధ ఆలయంలో కూడా పూజలు నిర్వహించాడు తాజాగా సినిమాలో తన ఫేవరెట్ రోల్ ని పరిచయం చేసాడు..

తండ్రి మరణంతో కృంగిపోతున్న సమంత.. తోడుగా నిలుస్తున్న అభిమానులు..!!

RC16 కి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్ ను బుచ్చి బాబు సోషల్ మీడియా లో విడుదల చేశారు.ఇప్పటికే ఈ భారీ బడ్జెట్ సినిమాలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, జగపతిబాబు వంటి స్టార్స్ ని ఆన్ బోర్డ్ చేసుకున్న మేకర్స్ తాజాగా మీర్జాపూర్ వంటి ఫేమస్ సిరీస్ లో మున్నా భయ్యా పాత్రతో ఎంతో పాపులర్ అయిన దివ్యేందు శర్మ ను మేకర్స్ ఆన్ బోర్డ్ చేసుకున్నారు.తాజాగా ఆయన లుక్ ను మేకర్స్ రిలీజ్ చేశారు..ఈ పోస్టర్లో దివ్యేందు శర్మ రగ్గుడ్ లుక్కుతో కనిపిస్తున్నాడు… మా భయ్యా.. మీ భయ్యా.. మున్నా భయ్యా అంటూ RC16 సినిమాలోకి ఆహ్వానిస్తున్నట్లు గా దర్శకుడు బుచ్చిబాబు పోస్టర్ ను విడుదల చేశారు

Related posts

ఎన్టీఆర్ తో పాటు సైఫ్ ని పొగిడితీరాల్సిందే

filmybowl

Pushpa 2 : ట్రైలర్ ఈవెంట్ కు దూరంగా సుకుమార్.. కారణం అదేనా..?

murali

అల్లు vs మెగా : పుష్ప 2 బెన్ఫిట్ షోస్ పై సరికొత్త పంచాయితీ..!!

murali

Leave a Comment