MOVIE NEWS

RC16 : చరణ్ బర్త్డే ట్రీట్..గట్టిగానే ప్లాన్ చేస్తున్నారుగా..!!

ఈ ఏడాది ప్రారంభంలోనే రాంచరణ్ ‘గేమ్ ఛేంజర్‌’ సినిమాతో ఫ్యాన్స్ ని నిరాశ పరిచాడు.. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది..దీనితో మెగా ఫ్యాన్స్ కు సాలిడ్ బ్లాక్ బస్టర్ ఇచ్చేందుకు రామ్ చరణ్ సిద్ధం అవుతున్నాడు. ప్రస్తుతం రాంచరణ్ తన తరువాత సినిమాను ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు డైరెక్షన్ లో చేస్తున్న సంగతి తెలిసిందే.. “RC 16” అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ బిగ్గెస్ట్ మూవీని మేకర్స్ భారీగా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది..బిగ్గెస్ట్ స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతుంది..

పుష్ప 3 షూటింగ్ పై బిగ్ అప్డేట్.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత..!!

ఈ సినిమాలో కుస్తి, కబడ్డీ, క్రికెట్‌తో పాటు ఇంకా ఎన్నో ఆటలు ఈ సినిమాలో ఉంటాయని అయితే రాంచరణ్ ఈ సినిమాలో “ఆటకూలీగా” కనిపిస్తాడని సమాచారం..అయితే ఈ సినిమా పై రోజు రోజుకి అంచనాలు భారీగా పెరుగుతున్నాయి..ఇదే సమయంలో మార్చ్ 27 న రామ్ చరణ్ బర్త్ డే గిఫ్ట్‌గా RC16 నుంచి అదిరిపోయే ట్రీట్ ప్లాన్ చేస్తున్నట్టుగా న్యూస్ వైరల్ అవుతుంది..దర్శకుడు బుచ్చి బాబు.. రామ్ చరణ్ ఫ్యాన్స్ కోసం RC 16 టైటిల్‌తో పాటు ఒక స్పెషల్ గ్లింప్స్ ను కూడా రెడీ చేస్తున్నారని, అందుకోసం సపరేట్‌గా ఓ ఫోటో షూట్ కూడా నిర్వహిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.

కానీ RC 16 గ్లిం ప్స్ అయితే కట్ చేసారు కాని మ్యూజిక్ డైరెక్టర్ ఎఆర్ రెహమాన్ ఇంకా మ్యూజిక్ ఇవ్వలేదు.ఇప్పటి నుండి వర్క్ స్టార్ట్ చేసిన చరణ్ బర్త్ డే నాటికి వర్క్ ఫినిష్ అవ్వకపోవచ్చు అని తెలుస్తోంది. కానీ చరణ్ బర్త్డే కి కచ్చితంగా స్పెషల్ అప్డేట్ వస్తుంది అని మెగా ఫ్యాన్స్‌ ఎదురు చూస్తున్నారు.. డిసప్పాయింట్ చేసే ఛాన్స్ లేదని కొందరు అంటున్నారు. గ్లింప్స్ వచ్చినా రాకపోయినా ఆర్సీ 16 టైటిల్ రివీల్ చేసే ఛాన్స్ ఉందని తెలుస్తుంది.అయితే ఈ సినిమాకు “పెద్ది” అనే టైటిల్ లాక్ చేశారని తెలుస్తుంది..ఈ సినిమాలో బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, జగపతి బాబు కీలక పాత్రలో నటిస్తున్నారు

 

Related posts

మరో ప్లాప్ దర్శకుడి చేతిలోకి “గేమ్ ఛేంజర్”.. రాంచరణ్ మూవీని ఇక ఆ దేవుడే కాపాడాలి..!!

murali

పుష్ప 2 : హమ్మయ్య మొత్తానికి ముగించేసారంటూ ఊపిరి పీల్చుకుంటున్న ఫ్యాన్స్..!!

murali

బాలయ్య వారసుడి సినీ ఎంట్రీ ఇప్పట్లో లేనట్లేనా..?

murali

Leave a Comment