MOVIE NEWS

RC16 : గ్లోబల్ స్టార్ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో.. ఫ్యాన్స్ కి పండగే..?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘గేమ్ ఛేంజర్’.. స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ జనవరి 10 న సంక్రాంతి కానుకగా గ్రాండ్ గా రిలీజ్ అయింది. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు.. ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి షో నుంచే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో కాలంగా ఎదురుచూసారు.. కానీ సినిమా ఫలితం వారిని తీవ్ర నిరాశపరిచింది.ఈ సినిమా కు ఏకంగా 450 కోట్ల భారీ బడ్జెట్ పెట్టినట్లు సమాచారం.. ఆ రేంజ్ కలెక్షన్స్ “గేమ్ ఛేంజర్” సాదించలేకపోయింది.. దీంతో రాంచరణ్ తన తదుపరి సినిమా ‘RC 16’ పై గట్టిగా ఫోకస్ చేస్తున్నారు.

“ఓజి” మూవీకి సెకండ్ పార్ట్..పవన్ కల్యాణ్ రియాక్షన్ ఇదే..!!

ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు డైరెక్షన్‌లో రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న మూవీ ‘RC 16’. ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ జోరుగా జరుగుతోండగా ఈ మూవీకి సంబంధించిన అప్ డేట్స్ కూడా వరుసగా వస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ చిన్న పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఈ మూవీలో ఆయన పాత్ర దాదాపు ఒక ఐదు నిమిషాల పాటు ఉండే విధంగా మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

అంతేకాదు చిత్ర యూనిట్ రణబీర్ కపూర్‌ని కలిసి అతనికి కథ చెప్పి అతన్ని ఒప్పించినట్టుగా టాక్ వినపడుతుంది.ఇక ఇటివల ‘యానిమల్’ సినిమాతో తెలుగులో కూడా రన్‌బీర్ కి మంచి మార్కెట్ ఏర్పడింది.ఈ న్యూస్ కనుక నిజం అయితే ‘RC16’ సినిమాపై బాలీవుడ్ లో కూడా మంచి బజ్ ఏర్పడుతుంది..ఈ సినిమాలో బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండటంతో సినిమాపై సూపర్ క్రేజ్ ఏర్పడింది..

 

Related posts

ఎస్ఎస్ఎంబి : హమ్మయ్య ఎట్టకేలకు మొదలు పెడుతున్న జక్కన్న..!!

murali

పవర్ స్టార్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. వీరమల్లు సాంగ్ మరింత లేట్..!!

murali

అజయ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ రెడీ.. ఆ హీరో తో సినిమా కాన్ఫమ్డ్.

filmybowl

Leave a Comment