MOVIE NEWS

RC 16: జాన్వీకి మేకర్స్ బిగ్ సర్ప్రైజ్.. ఫస్ట్ లుక్ పోస్టర్ అదిరిందిగా..!!

బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. అతిలోక సుందరి శ్రీదేవి కూతురిగా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయిన జాన్వీ కపూర్ 2018లో ‘ధడక్’ మూవీతో బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది..ఈ అందాల భామ చాలా తక్కువ సమయంలో తన కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.బాలీవుడ్ లో గ్లామర్ రోల్స్ తో పాటు పెర్ఫార్మన్స్ బేస్డ్ రోల్స్ కూడా చేస్తూ అదరగొట్టింది..గత ఏడాది మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ సినిమాతో ఈ భామ టాలీవుడ్‌ కు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది..జాన్వీ కపూర్ తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది..

హిందీ స్ట్రీమింగ్ కి సిద్ధమవుతున్న ” గేమ్ ఛేంజర్”..!!

ప్రస్తుతం రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “RC 16”లో కూడా ఈ భామ హీరోయిన్ గా నటిస్తుంది..ఇదిలా ఉంటే నేడు (మార్చి 6) ఈ ముద్దుగుమ్మ పుట్టిన రోజు.. ఈ హాట్ బ్యూటీ నేడు 28వ వసంతంలోకి అడుగుపెడుతోంది.ఈ సందర్భంగా జాన్వీకపూర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలను తెలియజేస్తు “RC16”చిత్ర యూనిట్ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఇందులో జాన్వీకపూర్ కుడి చేత్తో మేకపిల్లను ఎత్తుకోగా, ఎడమ చేత్తో గడ్డి మొక్కను పట్టుకుని చిరునవ్వులు చిందిస్తోంది. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో ఈ బిగ్గెస్ట్ మూవీ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో వస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రంలో జగపతి బాబు, శివరాజ్ కుమార్ వంటి స్టార్స్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు.ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌, వృద్ధి సినిమాస్‌, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

 

Related posts

ప్రభాస్ కోసం మరో ‘లెజెండరీ యాక్టర్ ని తీసుకొస్తున్న మైత్రి మూవీ మేకర్స్

filmybowl

కంగువా : జ్యోతిక రివ్యూ సినిమాకు కొత్త చిక్కులు తెచ్చిపెట్టిందా..?

murali

రజనీకాంత్‌కు అనారోగ్యం.. చెన్నై అపోలో ఆసుపత్రికి తరలింపు

filmybowl

Leave a Comment