RaviTeja Dhamaaka combination to repeat soon
MOVIE NEWS

రవితేజ : మరోసారి ‘ధమాకా’

RaviTeja Dhamaaka combination to repeat soon
RaviTeja Dhamaaka combination to repeat soon

RaviTeja Dhamaaka : మాస్ మహారాజ రవితేజ కి వరుసగా చిత్రాలు విడుదల అవుతున్నా ఏదీ విజయం సాధించలేదు. ఈ మధ్య కాలం లో ధమాకా ఒక్కటే హిట్‌గా నిలిచి వంద కోట్ల క్లబ్‌లో చేరింది.

దర్శకుడు నక్కిన త్రినాథరావు కు కూడా మాంచి విజయం లభించింది ఆ సినిమా తోనే. అప్పటి నుంచి టాలీవుడ్‌లో హీరోలకు త్రినాథరావు పై నమ్మకం పెరిగింది.

ఇప్పుడు ఆయన సందీప్‌ కిషన్‌ హీరోగా ‘మజాకా’ సినిమా తీస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతికి విడుదల చేయడానికి చిత్ర బృందం చూస్తున్నారు.

ఇండస్ట్రీ నుంచి వస్తున్న సమాచారం ప్రకారం ‘మజాకా’ తరవాత త్రినాథరావు మరోసారి రవితేజతో సినిమా కమిట్ అయినట్టు టాలీవుడ్‌ సర్కిల్స్ లో టాక్‌ వినిపిస్తోంది. అందుకు సంబంధించిన కథ కూడా సిద్థంగా ఉన్నట్టు సమాచారం.

దర్శకుడు టేకింగ్ స్టైల్ స్క్రిప్ట్ మీద ఉన్న అవగాహనా నచ్చి ధమాూకా తర్వాత వెంటనే మరో సినిమా చేయడానికి రవితేజ చాలా ఆసక్తి చూపించారు. అయితే.. అప్పటికే చాలా సినిమాలు కమిట్ అయి ఉండడం తో ముందు అవి కంప్లీట్ చేసుకొని వచ్చాడు రవితేజ.

అలాగే మరోవైపు దర్శకుడు త్రినాథరావు కూడా వేరే నిర్మాతల దగ్గర అడ్వాన్సు తీసుకొని ఉండడం తో ఇద్దరి కలయిక వెంటనే కుదరలేదు.

అయితే ఇప్పుడు ‘మజాకా’ పూర్తయిన వెంటనే రవితేజతో సినిమా కంఫర్మ్ అయిందని ఇన్‌ సైడ్‌ టాక్. ‘ధమాకా’ సమయంలోనే రవితేజకు ఒక లైన్‌ చెప్పి ‘ఓకే’ చేయించుకున్న నక్కిన. ఆ లైన్ కి తగ్గట్టు కథ ని రెడీ చేసుకున్నాడు అంటున్నారు.

Read Also : మ‌ళ్లీ భల్లాలదేవుడి దెగ్గరకే జ‌క్క‌న్నా?

ప్రస్తుతం రవితేజ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో శ్రీలీలే హీరోయిన్.

ఇటీవల సినిమా షూటింగ్ లో గాయపడడం, రవితేజకు ఆపరేషన్‌ జరగడం వల్ల, ఆ సినిమా షూటింగ్‌కు కాస్త బ్రేక్‌ ఇచ్చారు. అయితే ఇప్పుడు కోలుకున్న రవితేజ ఫిబ్రవరి, మార్చ్‌ నాటికి ఆ సినిమా షూటింగ్‌ పూర్తయ్యే అవకాశాలున్నాయి.

సమ్మర్ కి రవితేజ సినిమా రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నాడు నిర్మాత వంశి. ఆ తరవాత ధమాకా కాంబినేషన్ సినిమా పట్టాలెక్కుతుంది.

Follow us on Instagram

Related posts

అల్లుఅర్జున్ అరెస్ట్.. కెటీఆర్ సంచలన ట్వీట్..!!

murali

చరిత్రలో నిలిచిపోయే పాత్రలో అల్లుఅర్జున్ ..బన్నీపై త్రివిక్రమ్ భారీ ప్రయోగం ..?

murali

‘కాంతారా2’లో…. మరో స్టార్ హీరో…. ఎవరంటే????

filmybowl

Leave a Comment