RaviTeja 76 : రవితేజ.. సినీ పరిశ్రమలో ఈ తరం నటులకి ఒక ప్రేరణ. ఎటువంటి బ్యాకప్ లేకపోయిన విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుండి మాస్ మహారాజా దాగా ఎదిగాడు. రవితేజ యాక్షన్‌కి, కామెడీకి ఎప్పుడు ఫ్యాన్స్ ఆడియన్స్ ఉంటారు ఆయన సినిమాలు చూసి కడుపారా నవ్వుకోని ప్రేక్షకులు ఉండరు
అయితే ఇటీవల కాలంలో రవితేజ సినిమాల్లో మజా తగ్గుతోంది. ఇంకేదో ఎక్కువవుతుంది అనే విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అవేంటో మీ అందరికి తెలుసు.
ఆ విషయం పక్కన పెడితే రవితేజ కి ఈ మధ్య హిట్స్ లేవు ఎప్పుడో వచ్చిన ఒకట్రెండు విజయాలు కూడా కామెడీ సినిమాలతోనే అందుకున్నారు. ఇప్పుడు
తిరిగి థాన స్టామినా ని ఇండస్ట్రీ కి గుర్తు చెయ్యడానికి
చూస్తున్న రవితేజ.. మరోసారి కామెడీ తోనే వస్తున్నట్టు తెలుస్తుంది.
రవితేజ సినిమాల జోరుకు హిట్ ప్లాప్ అనేవి పెద్దగా
అడ్డు రావు. మంచి విజయం పడితే ఎక్కువ అవకాశాలు వచ్చేయడం, ఫ్లాప్ పడితే ఢీలా పడిపోయి ఆగిపోదాం లాంటివి వుండవు.
Read Also : OG పెద్ద రేంజ్ హిట్ అవుతుంది – ఎస్ ఎస్ థమన్
ఈ విషయం మీరు రీసెంట్‌గా వరుస flops అందుకుంటున్నా సినిమాలూ ఒప్పుకోడం మాత్రం ఎక్కడ తగ్గలేదు. అందుకే వరుసగా ఎన్ని ప్లాప్స్ వచ్చినా చేతిలో రెండు సినిమాల తో బిజీ గా ఉన్నాడు మరో సినిమా దాదాపు ఓకే అయింది.
RT75 సినిమా షూటింగ్ లో గాయాల పాలయ్యి గ్యాప్ తీసుకుంటున్న రవి ని ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు సుందర్.సి కలిసి ఒక కథ చెప్పినట్టు తెలుస్తుంది. కథ నచ్చడం తో సినిమా చేయడానికి రవితేజ ఆసక్తికగా ఉన్నారు అని తెలుస్తుంది.
రవి తేజ సొంత నిర్మాణ సంస్థ ఆర్టీ టీమ్ వర్క్స్, సుందర్.సి నిర్మాణ సంస్థ కలసి ఈ సినిమా నిర్మాణం చేపడతారని అంటున్నారు. సుందర్ కి కామెడీ మీద మంచి పట్టున్న దర్శకుడు. రవితేజ కు కామెడీ కొట్టిన పిండి. ఈ నేపథ్యంలో ఇద్దరూ కాంబినేషన్ లో సినిమా అంటే వినోదం ఎలా ఉంటదో వేరే చెప్పాలా. అన్నీ కుదిరితే రవితేజ 75 తర్వాత ఈ సినిమా స్టార్ట్ అవుతుంది.
Follow us on Instagram