టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు..ఇప్పటి వరకు ఈ దర్శకుడు తెరకెక్కించిన సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి.. పటాస్,రాజా ది గ్రేట్, ఎఫ్2,సరిలేరు నీకెవ్వరు, భగవంత్ కేసరి వంటి సినిమాలతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించిన అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవితో ఒక సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం మెగాస్టార్ యంగ్ డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘విశ్వంభర’ అనే సోషియో ఫాంటసీ మూవీలో నటిస్తున్నారు. ఈ చిత్రం 2025లో విడుదల కానుంది. ఇప్పటికే షూటింగ్ పనులు కూడా పూర్తి అయినట్లు సమాచారం.. త్వరలో ఈ చిత్రం విడుదలపై మేకర్స్ క్లారిటీ ఇవ్వనున్నారు..ఈ సినిమా తర్వాత దర్శకుడు అనిల్ రావిపూడితో చిరంజీవి ఒక సినిమా చేయనున్నారని సమాచారం.. ఈ భారీ ప్రాజెక్ట్‌ను షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి గ్రాండ్ గా నిర్మించనున్నట్లు ప్రచారం జరుగుతుంది.
మావయ్య నాగబాబుని కలిసిన ఐకాన్ స్టార్.. వీడియో వైరల్..!!
భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను నిర్మించాలని వారు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో చిరంజీవి పాత్ర సరికొత్తగా ఉండనుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. త్వరలో అధికారికంగా ఈ కాంబినేషన్‌పై ప్రకటన రానుంది.దర్శకుడు అనిల్ రావిపుడి కూడా ప్రస్తుతం సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ తో ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే సినిమాను తెరకెక్కించే పనుల్లో బిజీగా ఉన్నారు. జనవరి 14న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు.నా చిన్నతనం నుంచి చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వేంకటేశ్ చిత్రాలను చూస్తూ పెరిగానని అనిల్ తెలిపారు..వాళ్లతో సినిమా చేయడం తన అదృష్టం అని ఆయన అన్నారు. ఇప్పటికే బాలకృష్ణ, వేంకటేశ్‌లతో కలిసి సినిమా చేశాను. ఇప్పుడు చిరంజీవితో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని అనిల్ తెలిపారు.