MOVIE NEWS

నక్క తోక తొక్కిన రవితేజ బ్యూటీ..ఏకంగా ఆ స్టార్ హీరో సరసన లక్కీ ఛాన్స్..?

మాస్ మహారాజ్ రవితేజ, స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘మిస్టర్‌ బచ్చన్‌’.. ఎన్నో అంచనాలతో గత ఏడాది రిలీజ్ అయిన ఈ బిగ్గెస్ట్ మూవీ డిజాస్టర్ గా నిలిచింది.. ఈ సినిమాలో రవితేజ సరసన హాట్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్ గా నటించింది.. ఈ సినిమాతోనే భాగ్యశ్రీ టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది.. మొదటి సినిమానే ప్లాప్ అవ్వడంతో ఈ భామ నిరాశకు గురైంది.. మిస్టర్ బచ్చన్ సినిమా ఎలా వున్న్నా కానీ హీరోయిన్ గా భాగ్యశ్రీ గ్లామర్ కి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. తన డ్యాన్స్‌తో నటి భాగ్యశ్రీ బోర్సే ప్రేక్షకులను ఎంతగానో అలరించింది..తన మొదటి సినిమా ప్లాప్ అయినా ఈ బ్యూటీకి వరుస ఆఫర్లు వస్తున్నాయి.

ఎన్టీఆర్ పోస్ట్ కు బ్రహ్మీ ఫన్నీ రిప్లై.. ఈ ఫీలింగ్ ఏంట్రా చారి..!!

తాజాగా భాగ్యశ్రీకి మరో బంపర్‌ ఆఫర్ వచ్చినట్లు న్యూస్ వైరల్ అవుతుంది..తమిళ స్టార్‌ హీరో సూర్య సరసన హీరోయిన్ గా ఈ భామను ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది.సూర్య హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ సినిమా రానున్నట్లు గత కొద్దీ రోజులుగా న్యూస్ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్‌గా భాగ్యశ్రీని ఎంపిక చేసినట్లు సమాచారం. ఇప్పటికే ఆమెతో చర్చలు జరిపారని ఈ ప్రాజెక్ట్‌కు ఆమె గ్రీన్ సిగ్నల్‌ కూడా ఇచ్చినట్లు టాక్‌ నడుస్తుంది… ఈ ఏడాది మే నెలలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించనున్నట్లు సమాచారం.. సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై ఈ సినిమా రానుందని జీవీ ప్రకాశ్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నట్లు సినీ వర్గాల సమాచారం.

ఇప్పటికే భాగ్యశ్రీ చేతిలో వరుస సినిమాలు ఉన్నాయి. సెల్వమణి సెల్వరాజ్‌ దర్శకత్వంలో దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా తెరకెక్కుతున్న ‘కాంత’చిత్రంలో భాగ్యశ్రీ హీరోయిన్ గా నటిస్తుంది..అలాగే పి.మహేశ్‌ దర్శకత్వంలో యంగ్‌ హీరో రామ్‌ పోతినేని ప్రధాన పాత్రలో నటిస్తున్న “RAPO22” లో కూడా భాగ్యశ్రీ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ కూడా ప్రారంభమైంది. అలాగే భాగ్యశ్రీ నటిస్తున్న మరో బిగ్గెస్ట్ మూవీ “కింగ్డమ్”.. విజయ్‌ దేవరకొండ- గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్‌లో వస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీలో ఈ హీరోయిన్ గా నటిస్తుంది…

 

Related posts

పుష్ప 3 నుంచి పవర్ ఫుల్ డైలాగ్ లీక్.. మాములుగా లేదుగా..?

murali

ఎన్టీఆర్ – నీల్ సినిమాకు ఇంట్రెస్టింగ్ టైటిల్.. ఫ్యాన్స్ కి నచ్చుతుందా..?

murali

ప్రభాస్ ” స్పిరిట్” షూటింగ్ కి ముహూర్తం ఫిక్స్..?

murali

Leave a Comment