MOVIE NEWS

ఆ క్లాస్ డైరెక్టర్ తో మూవీకి సిద్ధమవుతున్న రవితేజ..!!

మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు.. అయితే గత కొంతకాలంగా వరుస ప్లాప్స్ తో రవితేజ ఇబ్బంది పడుతున్నాడు.. గత ఏడాది ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిన “మిస్టర్ బచ్చన్“ సినిమా డిజాస్టర్ గా నిలిచింది.. స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ ప్రేక్షకులు అంతగా ఆకట్టుకోలేదు.. ప్రస్తుతం రవితేజ ‘మాస్‌ జాతర’ అనే సినిమా చేస్తూ బిజీగా ఉన్నారు. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటైర్టెన్మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.మే 9న సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది.ఈ సినిమాలో రవితేజ సరసన క్యూట్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది.. ఈ సినిమా పక్కా మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది.

“ఛావా”కు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్.. స్పందించిన నిర్మాత..!!

ఈ సినిమా తర్వాత రవితేజ చేయబోయే సినిమాపై ఓ ఆసక్తికరమైన వార్త తెగ వైరల్ అవుతుంది..నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగి, చిత్రలహరి వంటి క్లాస్‌ చిత్రాలను తెరకెక్కించిన కిశోర్‌ తిరుమల కథను రవితేజ ఓకే చేశారని న్యూస్ వైరల్ అవుతుంది..అయితే కిశోర్‌ తిరుమల సినిమాలు చాలా క్లాస్ గా ఉంటాయి..మరి రవితేజ వంటి మాస్‌ హీరతో ఈ క్లాస్ డైరెక్టర్ ఎలాంటి సినిమా చేస్తాదనేది తెలియాల్సి వుంది..

ఇదిలా ఉంటే రవితేజకు గతంలో “ ధమాకా” వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు త్రినాథరావు నక్కిన రవితేజతో మరో సినిమా చేసేందుకు సిద్ధంగా వున్నాడు.. ఈ సినిమా “ డబుల్ ధమాకా “ టైటిల్ పెట్టనున్నట్లు తెలుస్తుంది. రవితేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ధమాకాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్నట్లు సమాచారం.

 

Related posts

RC16 : ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. చరణ్ బర్త్డే బిగ్ అప్డేట్..!!

murali

వెంకీ మామ లా మారిన ఆ క్యూట్ హీరోయిన్.. చంటి గెటప్ అదిరిందిగా..!!

murali

కాంతార తో వార్ అయేటట్లుందే

filmybowl

Leave a Comment