MOVIE NEWS

“డబుల్ ధమాకా” తో వస్తున్న రవితేజ.. ఈ సారి అంతకు మించి..!!

మాస్ మహారాజా రవితేజ నటించిన “ ధమాకా “ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీ లీల హీరోయిన్ గా నటించింది.. 2022లో వచ్చిన ఈ ‘ధమాకా’ సినిమాకు త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహించారు..ఈ సినిమాతో రవితేజ తన కెరీర్ లోనే భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు.ఈ సినిమా ఏకంగా రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది..అంతేకాదు రవితేజ కెరియర్ లోనే మొదటి రూ.100 కోట్ల గ్రాస్ వసూల్ సినిమాగా “ధమాకా’ నిలిచింది. అంతే కాదు నటి శ్రీలీలకి కూడా ఈ సినిమా భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించింది.అయితే ఈ సినిమా తర్వాత రవితేజకు మళ్ళీ ఇప్పటివరకు ఆ రేంజ్ హిట్ లభించలేదు.

హను-మాన్ దర్శకుడితో ప్రభాస్ భారీ పాన్ ఇండియా మూవీ..?

ఇదిలా ఉంటే రవితేజ త్వరలోనే ‘మాస్ జాతర’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి…అలాగే దర్శకుడు త్రినాధ రావు నక్కిన కూడా ‘మజాకా’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.. “మజాకా” సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది.ఈ నేపథ్యంలోనే తాజాగా మీడియాతో మాట్లాడిన త్రినాధ రావు నక్కిన తన నెక్స్ట్ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ తెలిపారు.

మొదట మజాకా సినిమాకి సీక్వెల్ తీద్దాం అని అనుకున్నాము. డబుల్ మజాకా అని టైటిల్ కూడా ఫిక్స్ చేసుకున్నాం. కాని భవిష్యత్తులో అది రూపు దిద్దుకుంటుందో లేదో అనే అనుమానంతో ప్రస్తుతానికి ఆపేసాము. ఇక ఇప్పుడు రవితేజకి నేను ఒక కథ చెప్పాను. అది ధమాకాకు మించి ఉంటుంది. దానికి “డబుల్ ధమాకా” అని టైటిల్ పెట్టాలనుకున్నాము. సినిమా కథ రవితేజ గారికి నచ్చడంతో ఆయన కూడా ఓకే చెప్పారు. దీంతో ధమాకా సీక్వెల్ చేయడానికి సిద్ధమయ్యాము అని త్రినాధ రావు తెలిపారు.

 

Related posts

పెద్ది : చరణ్ క్యారెక్టర్ అలా ఉండబోతుందా..?

murali

బాలయ్య తో మరో ఊర మాస్ మూవీ ప్లాన్ చేస్తున్న ఆ స్టార్ డైరెక్టర్..!!

murali

ఎన్టీఆర్-నీల్ : ఎట్టకేలకు ఎంట్రీ ఇస్తున్న తారక్.. అనౌన్స్మెంట్ పోస్టర్ అదిరిందిగా..!!

murali

Leave a Comment