టాలీవుడ్ యంగ్ హీరో ఉస్తాద్ రామ్ పోతినేని గత ఏడాది డబుల్ ఇస్మార్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ సినిమా అంతగా ఆకట్టుకోకపోవడంతో రామ్ రూటు మార్చి తనకు బాగా కలిసి వచ్చిన లవ్ స్టోరీస్ కే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు.. తాజాగా హీరోగా టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న లేటెస్ట్ సినిమా RAPO 22. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ఫేమ్ మహేష్ బాబు.పి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మాతలుగా వ్యవహారిస్తున్నారు.. రామ్ 22వ సినిమాగా వస్తున్న ఈ సినిమాలో రామ్ సరసన అందాల భామ భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాతో అయినా తమ హీరో స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇవ్వాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
AA22 : సీక్రెట్ గా పూజా కార్యక్రమం.. అట్లీ ప్లాన్ అదిరిందిగా..!!
కాగా ఈ సినిమాలో ఓ ముఖ్యమైన పాత్ర కోసం ఎప్పటినుండో సీనియర్ నటుడి కోసం అనేక పేర్లు పరిశీలిస్తున్నారని సమాచారం.. మొదట ఈ పాత్ర కోసం గాడ్ ఆఫ్ మాస్ నందమూరి బాలకృష్ణ పేరు వినిపించింది. అలాగే మోహన్ లాల్, సూపర్ స్టార్ రజనీకాంత్, శివరాజ్ కుమార్ వంటి స్టార్స్ పేర్లు కూడా వినిపించాయి. కానీ తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర ను మేకర్స్ సంప్రదించారట. ఇప్పటికే ఈ విషయమై ఉపేంద్రతో దర్శకులు చర్చలు జరిపారని సమాచారం.. సినిమాలో ఆయన క్యారెక్టర్ నచ్చడంతో ఉపేంద్ర గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. త్వరలోనే దీనిపై మేకర్స్ అధికారక ప్రకటన చేయనున్నారు..తమిళ ద్వయం వివేక్,మెర్విన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు..ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది.