ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని కెరీర్ ప్రస్తుతం డౌన్ ఫాల్ అయింది.. ఆయన నటించిన సినిమాలు ప్రేక్షకులని మెప్పించలేకపోతున్నాయి.. భారీ అంచనాలతో వచ్చిన స్కంద, ఇస్మార్ట్ శంకర్ 2 ప్రేక్షకులని అంతగా మెప్పించలేదు…దీనితో రూట్ మార్చిన రామ్ సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు..రామ్ హీరోగా టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో యంగ్ డైరెక్టర్ మహేష్ బాబు పి ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు.ఈ చిత్రానికి నవీన్ ఎర్నేని, వై. రవి శంకర్ నిర్మాతలుగా వ్యవహారిస్తున్నారు… అయితే హీరోగా రామ్ కి ఇది 22వ చిత్రం.ఇందులో హీరో రామ్ సరసన హాట్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుంది.
స్టార్ డైరెక్టర్ శంకర్ డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటో తెలుసా..?
ఈ సినిమాలో సాగర్ పాత్రలో రామ్ పోతినేని నటిస్తున్నారు. ఆయన క్యారెక్టర్ ఫస్ట్ లుక్ కొన్ని రోజులు క్రితం విడుదల చేశారు. అలాగే, న్యూ ఇయర్ సందర్భంగా ఈ రోజు హీరోయిన్ భాగ్య శ్రీ బోర్సే ఫస్ట్ లుక్ ను మేకర్స్ విడుదల చేశారు.’మన సాగర్ గాడి లవ్వు… మహా లక్ష్మి’ అంటూ హీరో హీరోయిన్లు జంటగా ఉన్న పోస్టర్ ను మేకర్స్ విడుదల చేశారు. హీరోయిన్ భాగ్య శ్రీ లుక్ ఎంతో ట్రెడిషనల్ గా వుంది..రామ్ క్యూట్ ఎక్స్ ప్రెషన్ తో ఎంతగానో అలరించాడు..ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ఇటీవల పూర్తయింది.
”హైదరాబాద్‌లో మొదలైన ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ ఇటీవల పూర్తి అయ్యింది.. సినిమాలో రామ్, భాగ్య శ్రీ జోడీ క్యూట్ గా ఉందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు..సినిమాలో వీళ్లిద్దరి మధ్య వచ్చే సీన్లు హైలైట్ అవుతాయి” అని దర్శక నిర్మాతలు తెలిపారు.మాస్ సినిమాల జోన్ లోకి వెళ్లి దెబ్బ తిన్న రామ్ తనకి ఎంతగానో కలిసొచ్చిన లవ్ స్టోరీతో మరో హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.