MOVIE NEWS

పవర్ స్టార్ సరసన రంగమ్మత్త.. క్రేజీ ఆఫర్ దక్కించుకుందిగా..?

టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు..మెగాస్టార్ తమ్ముడిగా సినీ ఎంట్రీ ఇచ్చిన పవన్ కల్యాణ్ తనదైన శైలిలో ప్రేక్షకులని అలరించి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు..పవన్ కల్యాణ్ కి వున్న ఫ్యాన్ ఫాలోయింగ్ టాలీవుడ్ లో ప్రస్తుత స్టార్ హీరోలలో ఏ హీరోకి లేరని చెప్పొచ్చు..కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉండగానే రాజకీయాలలోకి వెళ్లిన పవన్ కల్యాణ్ దాదాపు పదేళ్ల పాటు ఎన్నో ఇబ్బందులు పడి తాను స్థాపించిన పార్టీని ప్రజలకు చేరువ చేయగలిగారు.. గత ఎన్నికల్లో ఆయన స్థాపించిన జనసేన పార్టీ వంద శాతం స్ట్రైక్ రేట్ తో పోటీ చేసిన ప్రతీ స్థానంలో విజయం సాధించింది.. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పవన్ భాద్యతలు చేపట్టారు..

బాలయ్య “డాకు మహారాజ్ ” ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే..?

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో చురుగ్గా పాల్గొంటున్నారు. ఏపీ డిప్యూటీ సీఎంగా తనదైన మార్క్ పాలనను చేస్తున్నారు. అయితే.. తన బాధ్యతలను నిర్వహిస్తూనే గతంలో ఒప్పుకున్న సినిమాలను, ప్రస్తుతం తాను చేయవలసిన సినిమాలను కూడా కంప్లీట్ చేసే పనిలో పడ్డారు పవర్ స్టార్. అయితే తాజాగా పవన్ కల్యాణ్ నటిస్తున్న బిగ్గెస్ట్ పీరియాడిక్ మూవీ హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.పవన్ కళ్యాణ్ ఇటీవల హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ లో మళ్ళీ జాయిన్ అయ్యారు.. ఈ సినిమాలో మిగిలిన భాగాన్ని వేగంగా కంప్లీట్ చేయనున్నట్లు సమాచారం.  ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.

ఈ సినిమాలో క్రేజీ ఐటమ్ సాంగ్ ను పెట్టాలని మూవీ మేకర్స్ ఆలోచిస్తున్నారట. అయితే ఇప్పటివరకు ఐటమ్ సాంగ్స్ లలో సమంత ఇటు శ్రీలీల అలరించిన విధానం అందరికి తెలిసిందే… అయితే వీరిద్దరు కాకుండా..సిల్వర్ స్క్రీన్ పై రంగమ్మత్తగా ఫేమ్ సంపాదించుకున్న నటి అనసూయను ఈ సాంగ్ కోసం రంగంలో దింపాలని మేకర్స్ భావిస్తున్నారట. అనసూయతో చేయించే స్పెషల్ సాంగ్ కు గణేష్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించనున్నట్లు సమాచారం..అలాగే ఈ స్పెషల్ సాంగ్ ను ఎం ఎం కీరవాణి కంపోజ్ చెయ్యనున్నట్లు తెలుస్తుంది. అయితే ఇందుకు సంబంధించిన అధికార ప్రకటన త్వరలోనే రానున్నట్లు సమాచారం..

Related posts

అల్లు అర్జున్, త్రివిక్రమ్ మూవీ బిగ్ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది ఎప్పుడంటే..?

murali

విశ్వంభర” టీజర్.. ఫీడ్ బ్యాక్ ఇదే

filmybowl

బేబమ్మ ఆశలన్నీ వాళ్ళ మీదే..!

filmybowl

Leave a Comment