టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్,యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రానా కాంబోలో తెరకెక్కిన ‘రానానాయుడు’ వెబ్ సిరీస్ ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 2023 మార్చిలో రిలీజ్ అయిన బోల్డ్ వెబ్ సిరీస్.. అడల్ట్ డైలాగ్స్, సీన్స్ తో తెరకెక్కింది.. ఈ బోల్డ్ వెబ్ సిరీస్ కి ఎన్నో విమర్శలు వచ్చాయి.ఫ్యామిలీ హీరోగా వెంకటేష్‌కు ఉన్న ఇమేజ్‌ను ఈ సిరీస్ బాగా డ్యామేజ్ చేసింది. దాంతో సెకండ్ సీజన్‌లో బోల్డ్‌నెస్ బాగా తగ్గించినట్లు సమాచారం. ఇక ‘రానా నాయుడు’ సీజన్ 2కు సంబంధించిన షూటింగ్ పార్ట్ చాలా రోజుల క్రితమే పూర్తయినట్లు తెలుస్తుంది.. తాజాగా సీజన్ 2 పై ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వైరల్ అవుతోంది. యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ నటించిన ‘జాక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ రీసెంట్ గా హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకకు రానా దగ్గుబాటి ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.
AA22: మరోసారి ఐకాన్ స్టార్ కి జోడిగా సమంత..?
కానీ ఆ వేడుకలో రానా దగ్గుబాటి కనిపించలేదు.రానా దగ్గుబాటి రాకపోవడం పై ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సిద్ధు జొన్నలగడ్డ క్లారిటీ ఇచ్చారు. రానా ముంబాయిలో ‘రానా నాయుడు’ వెబ్‌సిరీస్‌కు డబ్బింగ్ పనిలో ఉన్నాడని సిద్దూ తెలిపారు.తాజాగా వెంకటేష్‌తో పాటు రానా తమ పాత్రలకు డబ్బింగ్ పూర్తి చేసే పనిలో వున్నారు..
మే నెలలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొత్తం పూర్తి చేసి జూన్‌లో ఈ వెబ్‌సిరీస్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు.. కాగా ఈ సీజన్ 2 సిరీస్ ను నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది..ఈ సీజన్ 2లో వెంకటేష్, రానాతో పాటు అర్జున్ రాంపాల్, కృతి కర్భందా, సుర్వీన్ చావ్లా కీలక పాత్రల్లో నటించారు.. ఈ బిగ్గెస్ట్ బోల్డ్ వెబ్‌సిరీస్‌ను కరణ్ అన్షుమాన్, సూపర్న్ వర్మ తెరకెక్కించారు..