MOVIE NEWS

ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్న రాంచరణ్..”గేమ్ ఛేంజర్” ప్రీ రిలీజ్ ఈవెంట్ పై బిగ్ అప్డేట్ ..!!

గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “గేమ్ ఛేంజర్”..ఈ సినిమా కోసం ఫ్యాన్స్ గత మూడేళ్ళుగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అయిన దిల్ రాజు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.ఈ సినిమా అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూసారు.కానీ దర్శకుడు శంకర్ భారతీయుడు 2 సినిమా షూటింగ్ లో బిజీ గా వుండి సినిమా షూటింగ్ అంతకంతకు వాయిదా వేస్తూ వచ్చారు.దీనితో రాంచరణ్ ఫ్యాన్స్ అప్డేట్స్ అడిగి అడిగి విసిగిపోయారు.

ఈ సినిమాలో రాంచరణ్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది.అలాగే ఈ సినిమాలో ఎస్.జె.సూర్య ,శ్రీకాంత్ ,సునీల్ ,నవీన్ చంద్ర కీలక పాత్రలలో నటించారు.ఈ సినిమాలో రాంచరణ్ డ్యూయల్ రోల్ లో నటించాడు.ఈ సినిమాలో క్యూట్ బ్యూటీ అంజలి కూడా ముఖ్య పాత్రలో నటించింది.శంకర్ తెరకెక్కించిన భారతీయుడు 2 సినిమా డిజాస్టర్ గా నిలవడంతో ఫ్యాన్స్ “గేమ్ ఛేంజర్” ఏమవుతుందో అని టెన్షన్ పడుతున్నారు.ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా టీజర్ ని మేకర్స్ గ్రాండ్ గా రిలీస్ చేసారు.టీజర్ లో రాంచరణ్ లుక్స్ ,గ్రాండ్ విజువల్స్ ,థమన్ బిజిఎం ,కియారా గ్లామర్ అంతా బాగానే వుంది.”గేమ్ ఛేంజర్” పై ఎలాంటి డౌట్స్ పెట్టుకోవద్దని ఈ సినిమా బ్లాక్ బస్టర్ ఖాయం అని మేకర్స్ ఫ్యాన్స్ కి భరోసా ఇచ్చారు.

ఆ స్టార్ హీరోతో మరో భారీ ప్రాజెక్టు..లక్కీ ఛాన్స్ కొట్టేసిన నాగవంశీ..?

దీనితో “గేమ్ ఛేంజర్” పై ఫ్యాన్స్ లో అంచనాలు పెరిగాయి.ఈ సినిమాను మేకర్స్ 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.డిసెంబర్ నుంచి ఈ సినిమాకు సంబంధించి భారీ ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్మాత దిల్ రాజు ప్రకటించాడు.ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ఈవెంట్ పై ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది.’గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కాకినాడలో నిర్వహిస్తున్నారని సమాచారం. ‘గేమ్ ఛేంజర్’ యూనిట్ ఇప్పటికే కాకినాడ, పిఠాపురం ప్రాంతాల్లో ఈవెంట్ చేసేందుకు కొన్ని గ్రౌండ్స్ పరిశీలించినట్లు సమాచారం.ఈ ఈవెంట్ కోసం మెగా ఫ్యాన్స్ ఏంత్తో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఎన్నికలకు ముందు పిఠాపురంలో పవన్ కల్యాణ్ తరఫున రామ్ చరణ్ ప్రచారం నిర్వహించారు. తన బాబాయ్ పవన్ కల్యాణ్ ని ఎమ్మెల్యేగా గెలిపించాలని, ఇకపై తన సినిమా ప్రచార కార్యక్రమాలను ఈ ప్రాంతంలోనే నిర్వహిస్తానని ఆయన పిఠాపురం ప్రజలకు హామీ ఇచ్చారు. ఆ సమయంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు ఆయన తన ‘గేమ్ ఛేంజర్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కాకినాడ, పిఠాపురం పరిసర ప్రాంతాల మధ్యనే నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అలాగే ఈ ఈవెంట్ కి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హాజరు కానున్నట్లు తెలుస్తుంది.దీనితో ఫ్యాన్స్ లో జోరు మరింత ఎక్కువైంది.ఈ ఈవెంట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related posts

శంకర్ నెక్స్ట్ సినిమా ఎవరితోనో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

murali

ప్ర‌శాంత్ వ‌ర్మ సినిమాటిక్ యూనివ‌ర్స్‌లో 3rd ఫిలిం రాబోతుంది….

filmybowl

“మళ్ళీ సంక్రాంతికి వస్తున్నాం”.. అనిల్ రావిపూడి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

murali

Leave a Comment