గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ గేమ్ ఛేంజర్ “.. స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ ఈ సంక్రాంతి కానుకగా జనవరి 10 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది… దాదాపు నాలుగు ఏళ్ల తర్వాత సోలో హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రామ్ చరణ్ ఏ రేంజ్ విజయాన్ని సొంతం చేసుకుంటాడో అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.శంకర్ దర్శకత్వంలో నటించడం ద్వారా తన కల సాకారం అయ్యింది అంటూ చెప్పుకొచ్చిన రామ్ చరణ్ ఒక మంచి పవర్ ఫుల్ సినిమాలో నటించినందుకు చాలా సంతోషంగా ఉంది అంటూ ఇటీవల ఒక ప్రెస్ మీట్‌లో తెలిపారు..
అమ్మో..శంకర్ డ్రీం ప్రాజెక్ట్ బడ్జెట్ ఎంతో తెలుసా..?
అయితే ఇతర హీరోలు ఏడాదికి రెండు నుంచి మూడు సినిమాలు విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. కానీ చరణ్ మాత్రం స్లో గా సినిమాలు చేస్తున్నాడు.ఈ విషయమై ఫ్యాన్స్ ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ఒక రిపోర్టర్ రాంచరణ్ ని ప్రశ్నించగా.. తాను ఎంత జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్న అది కుదరడం లేదు. నా నుంచి ఏడాదికి రెండు సినిమాలు వస్తాయని ప్రతి సారి అనుకుంటాను. కానీ ఏదో కారణం వల్ల ఆ సినిమాలు ఆలస్యం అవుతున్నాయి. అలా ఎందుకు జరుగుతుంది అనేది నాకు కూడా తెలియడం లేదు అంటూ రామ్ చరణ్ పేర్కొన్నాడు.
కానీ ఈ ఏడాది నుంచి అయినా రెండు సినిమాలతో వస్తానని చరణ్ చెప్పుకొచ్చారు..అయితే ప్రస్తుతం చరణ్ బుచ్చిబాబు డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా కూడా ఈ ఏడాదే విడుదల అవుతుందా అంటే కచ్చితంగా చెప్పలేము..బుచ్చిబాబు సినిమా ఇప్పటికే ప్రారంభం అయ్యింది. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఆ సినిమాలో రామ్ చరణ్ స్పోర్ట్స్ పర్సన్‌గా కనిపించబోతున్నాడు..