MOVIE NEWS

పవన్ కోసం మళ్ళీ రంగంలోకి రమణ గోగుల..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సింగర్ రమణ గోగుల కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..ఆ క్రేజీ కాంబినేషన్ కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.వారి కలయికలో వచ్చిన సినిమాలు అన్నీ కూడా భారీ మ్యూజికల్ హిట్స్ గా నిలిచాయి.పవన్ సినిమాల్లో రమణ గోగుల పాడిన సాంగ్స్ అన్నీ ఇప్పటికీ కూడా ఫ్యాన్స్ కి ఫేవరెట్ గా నిలిచాయి..ఆ సాంగ్స్ ఎప్పుడు విన్నా కానీ కొత్తగానే అనిపిస్తుంటాయి.అంతలా మ్యూజిక్ లవర్స్ ను మెప్పించాయి. అయితే ఒకప్పుడు తన స్పెషల్ వాయిస్ తో అదిరిపోయే పాటలు పాడి అలరించిన రమణ గోగుల.. కొన్నాళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు.

సింగర్ గానే కాకుండా మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా ఎంతగానో అలరించిన రమణ గోగుల కొన్నాళ్ళుగా సినిమా ఫీల్డ్ కి దూరంగా వుంటూ వచ్చారు.. తాజాగా సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కుతున్న “సంక్రాంతి వస్తున్నాం” సినిమాతో ఆయన మళ్ళీ ఇండస్ట్రీలో రీఎంట్రీ ఇచ్చారు.ఆ సినిమా నుండి మేకర్స్ రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ గోదారి గట్టు మీద రామ చిలకవే సాంగ్ ను రమణ గోగుల ఆలపించారు.. ప్రస్తుతం ఆ సాంగ్ క్రేజ్ వేరే లెవెల్ లో వుంది..

గేమ్ ఛేంజర్ : తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే..?

రిలీజ్ అయిన కొద్ది క్షణాలకే భారీ వ్యూస్ సాధించి చార్ట్ బస్టర్ గా నిలిచింది. చాలా కాలం తర్వాత రమణ గోగుల పాట పాడటంతో ఫ్యాన్స్ అంతా రిపీటెడ్ మోడ్ లో వింటున్నారు. మైండ్ నుంచి పోవడం లేదని కామెంట్స్ చేస్తున్నారు.అదే సమయంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్.. తమ అభిమాన హీరో సినిమాలో కూడా సాంగ్ పాడాలని ఆయనని రిక్వెస్ట్  చేస్తున్నారు. మళ్లీ వింటేజ్ కాంబోను చూడాలనుకుంటున్నామని కామెంట్స్ చేస్తున్నారు.. రీసెంట్ గా రమణ గోగుల గారితో ఓజీ సినిమాలో ఒక సాంగ్ పాడించాలని అనుకుంటున్నట్లు ఓ ఇంటర్వ్యూలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా తెలిపారు.అది కనుక నిజమైతే ఫ్యాన్స్ కి పండగే అని చెప్పాలి..

Related posts

వెర్షన్స్ మారుస్తున్న సుకుమార్.. హీరో పాత్రలపై భారీ ప్రయోగాలు..!!

murali

తెలుగు రాష్ట్రాల్లో పుష్ప 2 కి భారీ ఊరట..టికెట్ రేట్స్ భారీగా పెంపు..!!

murali

మోక్షజ్ఞ డెబ్యూ సినిమా గురించి .. మరో ఇంట్రెస్టింగ్ న్యూస్

filmybowl

Leave a Comment