MOVIE NEWS

రాంచరణ్ ‘పెద్ది’ బిగ్గెస్ట్ అప్డేట్ వచ్చేసింది..!!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతుంది. రాంచరణ్ కెరీర్ లో ఈ సినిమా 16 వ సినిమాగా తెర కెక్కుతుంది. ఇటీవలే రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకు పెద్ది అనే టైటిల్ ప్రకటించి ఫస్ట్ లుక్ ను కూడా మేకర్స్ రిలీజ్ చేసారు.. ఫస్ట్ లుక్ పోస్టర్ లో రాంచరణ్ మాస్ లుక్ లో కనిపించాడు..రాంచరణ్ ఫస్ట్ లుక్ తో ప్రేక్షకులలో సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి..ఈ సినిమాలో బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీకపూర్ హీరోయిన్ గా నటిస్తుంది..

స్పిరిట్ : బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా..!!

అలాగే కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, మీర్జాపూర్ ఫేమ్ దివ్యేందు, అలాగే విలక్షణ నటుడు జగపతి బాబు ఈ సినిమాలో కీలక పాత్రలను పోషిస్తున్నారు..అయితే చరణ్ పుట్టిన రోజునే గ్లింప్స్ రిలీజ్ చేస్తారని ఫ్యాన్స్ భావించారు… కానీ టెక్నికల్ ప్రాబ్లమ్ వల్ల గ్లింప్స్ రిలీజ్ వాయిదా పడింది. తాజాగా నేడు ఉగాది పండగ సందర్భంగా పెద్ది సినిమా గ్లింప్స్ రిలీజ్ పై మేకర్స్ అప్డేట్ ఇచ్చారు.

రామ్ చరణ్ పెద్ది సినిమా ఫస్ట్ షాట్ – గ్లింప్స్ వీడియోని ఏప్రిల్ 6న శ్రీరామ నవమి పండగ రోజు రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. దీంతో ఫ్యాన్స్ ఈ గ్లింప్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ అప్డేట్ ని ఇస్తూ మేకర్స్ ఓ కొత్త పోస్టర్ రిలీజ్ చేసారు.ఈ పోస్టర్ లో చరణ్ గాల్లో జంప్ చేస్తున్నట్టు ఉంది.అయితే గ్లింప్స్ విషయంలో నిర్మాత చేసిన కామెంట్స్ బాగా వైరల్ అయ్యాయి.. దీనితో ఈ గ్లింప్స్ ఓ రేంజ్ లో ఉంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.. ఈ సినిమాని వృద్ధి సినిమాస్, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

 

Related posts

మహేష్ కు రాజమౌళి సరికొత్త కండిషన్స్.. బాబు పాటిస్తాడా..?

murali

బాలయ్య “డాకు మహారాజ్ ” ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే..?

murali

ఎదో ఒక డేట్ చెప్పి పుణ్యం కట్టుకోవయ్యా చైతూ

filmybowl

Leave a Comment