MOVIE NEWS

‘పెద్ది’ గా వస్తున్న రాంచరణ్.. ఊర మాస్ లుక్ అదిరిందిగా..!!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్ సర్ ప్రైజ్ వచ్చేసింది. నేడు రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా RC16 ప్రాజెక్ట్ నుంచి మోస్ట్ అవైటెడ్ టైటిల్, ఫస్ట్ లుక్‌ను మేకర్స్ ఈ రోజు విడుదల చేశారు.ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో వస్తున్న ఈ పాన్ ఇండియా మూవీకి ‘పెద్ది’ అనే టైటిల్‌ను మేకర్స్ ఫిక్స్ చేసారు.. గత కొంతకాలంగా ఈ టైటిల్ నెట్టింట తెగ వైరల్ అయింది.తాజాగా మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్లలో అధికారికంగా ప్రకటించారు. టైటిల్‌తో పాటు చరణ్ ఫస్ట్ లుక్ ని కూడా మేకర్స్ రిలీజ్ చేసారు.. చరణ్ ఊర మాస్ లుక్ అదిరిపోయింది..తాజాగా మేకర్స్ రెండు పోస్టర్లు రిలీజ్ చేయగా రెండూ కూడా దేనికదే సరికొత్త వైబ్స్‌ను పుట్టిస్తున్నాయి.

గ్లోబల్ స్టార్ బర్త్డే ఫ్యాన్స్ కి బిగ్ సర్ ప్రైజ్..!!

మొదటి పోస్టర్‌లో చరణ్ గుబురు గడ్డంతో, కళ్లలో మాస్ ఫైర్‌తో సిగరెట్ ను వెలిగిస్తున్నట్లు వుంది.రెండో పోస్టర్‌లో చరణ్ చేతిలో క్రికెట్ బ్యాట్ పట్టుకుని నిలిచిన విధానం చూస్తుంటే ఇది స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే బిగ్గెస్ట్ మాస్ ఎమోషనల్ డ్రామా అని తెలుస్తుంది.ఈ సినిమా కథ అంతా స్పోర్ట్స్ ఆధారంగా ఉంటుందని ముఖ్యంగా క్రికెట్ చుట్టూ తిరిగేలా ఉండబోతోందని తెలుస్తోంది.

కానీ రెగ్యులర్ స్పోర్ట్స్ డ్రామాగా కాకుండా మాస్ ఎలిమెంట్స్ తో కూడా గ్రామీణ నేపథ్య సినిమా అని తెలుస్తుంది.. ‘ఉప్పెన’తో బిగ్ హిట్ అందుకున్న బుచిబాబు, ఇప్పుడు ‘పెద్ది’ సినిమా తో పాన్ ఇండియా హిట్ అందుకోవాలని చూస్తున్నాడు.. చరణ్ ఈ సినిమాలో తన గత సినిమాలలో కంటే రా అండ్ రస్టిక్ పాత్రలో కనిపిస్తున్నాడు.. ప్రస్తుతం మేకర్స్ రిలీజ్ చేసిన చరణ్ మాస్ లుక్ పోస్టర్స్ నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి..

 

Related posts

చరణ్ కు మెగాస్టార్, ఎన్టీఆర్ స్పెషల్ బర్త్డే విషెస్..!!

murali

“మళ్ళీ సంక్రాంతికి వస్తున్నాం”.. అనిల్ రావిపూడి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

murali

సీక్రెట్ గా ఎంగేజ్మెంట్.. ఫ్యాన్స్ కి అఖిల్ సడెన్ సర్ప్రైజ్..!!

murali

Leave a Comment