Ram Charan Wax Statue : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరో అరుదైన రికార్డ్ క్రియేట్ చేశారు. ఏ సినిమానా అనుకుంటున్నారా!!!! ఇది సినిమా కి సంబంధించింది కాదు అంతకు మించిన ఘనత సాధించాడు మరి కొద్దీ రోజుల్లోనే రామ్ చరణ్ మైనపు విగ్రహం మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేయనున్నారు.
ఈ అరుదైన రికార్డు అందుకుంటున్న తొలి తెలుగు హీరోగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రికార్డ్ క్రియేట్ చేయబోతున్నారు అనే చెప్పాలి. దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళితే …
తెలుగు చలన చిత్ర పరిశ్రమ నుంచి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కంటే ముందు కొంత మంది టాలీవుడ్ స్టార్ హీరోల మైనపు విగ్రహాలను మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేశారు. కాకపోతే అవన్నీ వేరువేరు దేశాల్లో ఏర్పాటు చేయడం జరిగింది.
Read Also : విశ్వంబర ఎప్పటికి పూర్తయ్యెను ??
ఐతే ఈసారి లండన్ లోని మేడమ్ టుస్సాడ్స్ పుట్టిన ఇల్లు అయిన లండన్ మ్యూజియంలో గ్లోబల్ స్టార్ మైనపు విగహాన్ని ఏర్పాటు చేయడానికి అంతా సిద్దమవుతుంది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి జంతువులంటే ఎంత ప్రేమో అందరికి తెలిసిందే .ఆయన దగ్గర గుర్రాలు, కుక్కలు వంటివి చాలానే ఉన్నాయి. వాటికి రామ్ చరణ్ కి విడదీయలేని సంబంధం వుంది అది చాలా సార్లు మనం చూసాం. తాను ఎక్కడకి వెళ్లిన తనతో పాటే రైమ్ (పెంపుడు కుక్క Rhyme ) ని తీసుకెళ్తుంటారు. ఇప్పుడు మేడమ్ టుస్సాడ్స్ లండన్ మ్యూజియంలో ఏర్పాటు చేయనున్న విగ్రహం కూడా తన పెంపుడు కుక్క పిల్ల Rhyme తో కలిసి వుండే విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు.
Read Also : దేవర డే 1 కలెక్షన్స్ తో ఎన్టీఆర్ మాస్ జాతర
Ram Charan Wax Statue : రామ్ చరణ్ కి ముందు ఈ అరుదైన రికార్డు సాధించింది ఎవరెవరంటే!!!!
బ్యాంకాక్ మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో అడుగు పెట్టిన తొలి తెలుగు పాన్ ఇండియా హీరో రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి గెట్ అప్ లో ఉన్న విగ్రహాన్ని ఏర్పాటు చేసారు. అలాగే సింగపూర్ మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మైనపు విగ్రహన్ని శ్రీమంతుడు గెట్ అప్ లో ఉన్న విగ్రహాన్ని పెట్టారు. అదే మ్యూజియంలోనే అతిలోక సుందరి శ్రీదేవి మైనపు విగ్రహాన్ని ‘మిస్టర్ ఇండియా’లో గెటప్ తీసుకుని ఆ విగ్రహం రూపొందించారు.
Read Also : తెలుగు సినిమా అభిమానుల మధ్య మళ్ళి రాజేసుకున్న కలెక్షన్స్ కుంపటి.
ఇక తెలుగు తెర ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ విగ్రహం కూడా సింగపూర్ మ్యూజియంలో ఏర్పాటు చేశారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మైనపు విగ్రహాన్ని దుబాయ్ మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో పెట్టారు.
Follow us on Instagram