Ram Charan - Samantha combination soon
MOVIE NEWS

మరో రంగస్థలం లో చరణ్ – సమంత….

Ram Charan - Samantha combination soon
Ram Charan – Samantha combination soon

Ram Charan Samantha : తెలుగు సినిమా పరిశ్రమలో ఆ మధ్య యువ హీరోలు సినిమాలు రెండేళ్ళకి ఒకటి అన్నట్టు వుండేది. ఈ మధ్య స్పీడ్ అందుకున్నారు ప్రభాస్ సంవత్సరం గ్యాప్ లోనే రెండు సినిమాలతో పలకరించాడు వరసగా నాలుగు సినిమాలు చేస్తున్నాడు తారక్ కూడా అంతే. ఇప్పుడదే బాటలోకి రామ్ చరణ్ వచ్చాడు.

శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ చేంజర్’ చిత్రం పూర్తి చేసిన చరణ్ ఆ సినిమాని సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాడు.

‘గేమ్ చేంజర్’ షూటింగ్లో ఉండగానే రామ్ చరణ్ తన 16వ సినిమాను (పెద్ది) కూడా ప్రారంభించాడు. ఈ చిత్రాన్ని ‘ఉప్పెన’ డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వం వహించబోతున్నారు.

ఈ మధ్యనే అతిరధ మహారధులు మధ్య ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు పూర్తి చేసారు. సినిమా కోసం బాడీ బిల్డ్ చేసే పనిలో చరణ్ బిజీ గా వున్నాడు. త్వరలోనే ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ కూడా మొదలు పెట్టేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేసుకుంటోంది.

రామ్ చరణ్ – బుచ్చిబాబు కాంబోలో రాబోతున్న ఈ చిత్రం గ్రామీణ నేపథ్యం స్పోర్ట్స్ బ్యాగ్‌డ్రాప్‌ లో ఉండబోతుందని ఇప్పటికే ఇండస్ట్రీ లొ టాక్ మొదలైంది. అంతేకాదు, ఇందులో చరణ్ క్రీడాకారుడు పాత్రను చేస్తున్నాడని టాక్ వచ్చింది.

పాన్ ఇండియా రేంజ్‌లో ఈ సినిమా రూపొందుతోoది ఈ సినిమాలో చరణ్ లుక్ కంప్లీట్ గా కొత్తగా వుండబోతుంది అని ప్రచారం సైతం జరుగుతోంది. భారీ బడ్జెట్‌తో రూపొందనున్న ఈ సినిమాలో ఎంతో మంది ఇతర ఇండస్ట్రీ ల నుంచి బడా స్టార్లు భాగం అవుతున్నారు.

ఈ చిత్రంలో హీరోయిన్‌గా అలనాటి అందాల తార శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్‌ను తీసుకున్నారు. దేవర తర్వాత జాన్వీ చేస్తున్న రెండో తెలుగు సినిమా ఇదే. అలాగే, ముఖ్యమైన పాత్రల కోసం ప్రతి ఇండస్ట్రీ నుంచి గుర్తింపు ఉన్న నటీనటులను ఎంపిక చేస్తున్నారు.

ఇక ఈ చిత్రం కోసం రంగస్థలం లో చరణ్ కి కథానాయికగా నటించిన సమంత ను తీసుకున్నట్టు
ఫిలిం నగర్ లో వైరల్ అవుతుంది.

Read Also : లైగర్ కష్టం ఎక్కడకి పోలేదు….

ఈ ప్రతిష్టాత్మక సినిమాలో ఓ ముఖ్యమైన పాత్ర కోసం సమంత ను తీసుకున్నారట. రంగస్థలం అప్పుడు బుచ్చి బాబు అసిస్టెంట్ డైరెక్టర్ కావడం తొ ఆ రిలేషన్ తో సమంత నీ అప్రోచ్ అయ్యాడట. సమంత కూడా కథ విన్న వెంటనే ఈ సినిమాలో నటించేందుకు ఓకే చెప్పేసిందని సమాచారం

ఈ సినిమా లో సమంత పాత్ర ఎవరూ ఊహించని విధంగా, చాలా నేచురల్‌గా ఉంటుందని టాక్. గతంలో సమంత – రామ్ చరణ్ ‘రంగస్థలం’ మూవీలో జంటగా చేసిన విషయం తెలిసిందే. ఇది హిట్ పేరు కావడం తొ ఈ కాంబినేషన్ రిపీట్ అవ్వాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు .

పెద్ది సినిమా దాదాపు రూ. 400 కోట్లు భారీ బడ్జెట్‌తో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకటేష్ సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. అలాగే, ఈ మూవీకి మైత్రీ మూవీ మేకర్స్‌తో పాటు సుకుమార్ రైటింగ్స్ సంస్థలు నిర్మాణ భాగస్వాములుగా వ్యవహరిస్తున్నాయి. ఈ చిత్రానికి లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు.

Follow us on Instagram 

Related posts

వీరమల్లు కాదనుకుంటే విశ్వంభర రెడీ

filmybowl

మెగాస్టార్ తో సినిమా.. అనిల్ రావిపూడి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

murali

సితార ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ #27 గా అశోక్ గల్లా చిత్రం ప్రారంభం

filmybowl

Leave a Comment